Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026

Drain Flies: మీ బాత్రూమ్ గోడలపై ఈ చిన్న ఈగలు కనిపిస్తున్నాయా?.. ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ కనిపించవు..

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!
తెలంగాణ

Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక బులిటెన్ విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి తాజా విశ్లేషణ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలలో రాబోయే మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తమిళనాడు, కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి, పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదై, వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. అయితే, ఇది తాత్కాలికమే. ఆ తర్వాతి నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. సగటున 2 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఎండల తీవ్రత మళ్ళీ మొదలవ్వనుంది.

ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బయట తిరగవద్దని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

అటు, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం (23-03-26)శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది.ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! అప్పుల బాధతో వృద్ధుడి ఆత్మహత్య కలకలం

22 March 2026

అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్

22 March 2026

CM Revanth Reddy: నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

22 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

అమెరికాలో ఓ అమానుష ఘటన జరిగింది. కేవలం ఒక ఫ్రెంచ్ ఫ్రై ముక్క కోసం ఓ వ్యక్తి… పక్షి ప్రాణం…

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026

Drain Flies: మీ బాత్రూమ్ గోడలపై ఈ చిన్న ఈగలు కనిపిస్తున్నాయా?.. ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ కనిపించవు..

22 March 2026

Weather Update On 23 March 2026,AP Rains: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ జిల్లాలలో పిడుగులతో వానలు.. బీ అలర్ట్.. – apsdma weather forecast light to modarates rain with thunders on march 23rd in andhra pradesh

22 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

22 March 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్! ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్..

22 March 2026

Drain Flies: మీ బాత్రూమ్ గోడలపై ఈ చిన్న ఈగలు కనిపిస్తున్నాయా?.. ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ కనిపించవు..

22 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025199

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025198

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.