Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు.. తీరా పరిశీలించి చూడగా

23 March 2026

TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

23 March 2026

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?
తాజా వార్తలు

IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


IPL 2026 : మార్చి 28 నుంచి ఐపీఎల్ జాతర.. వరల్డ్ కప్ గెలిచిన మనోళ్లు ఎవరెవరు ఏ జట్లలో ఉన్నారో తెలుసా ?

IPL 2026 : మార్చి 8వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆ విజయోత్సాహం ఇంకా తగ్గకముందే, సరిగ్గా మూడు వారాల వ్యవధిలోనే మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలుకాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన మన ప్రపంచ విజేతలు ఈసారి ఐపీఎల్‌లో ఏ జట్టు తరపున ఆడుతున్నారు? వారిలో ఎవరి జట్లు మారాయి? అన్న ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ హీరోలు.. ఎవరెక్కడ?

భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన 15 మంది ఆటగాళ్లలో దాదాపు అందరూ తమ పాత జట్లకే పరిమితమయ్యారు. ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా తమ సత్తా చాటనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఈసారి సంజూ శాంసన్‌తో పాటు శివం దూబే కనిపిస్తారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆ జట్టుకు ప్రధాన బలంగా మారనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతుండగా, గుజరాత్ టైటాన్స్ జట్టులో వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్పిన్ మ్యాజిక్ చూపించనుండగా, పంజాబ్ కింగ్స్ జట్టులో అర్ష్‌దీప్ సింగ్ ఏకైక వరల్డ్ కప్ విజేతగా నిలిచారు.

సంజూ శాంసన్ ఒక్కడే మారాడు

వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్న 15 మందిలో 14 మంది తమ పాత టీమ్స్‌లోనే ఉండగా, కేవలం సంజూ శాంసన్ మాత్రమే తన జట్టును మార్చుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌ను వదిలి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం ఈ సీజన్ లోనే పెద్ద సెన్సేషన్. ఒక భారీ ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజూ చెన్నైకి వెళ్లగా, ఆయన స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు. ధోనీ వారసుడిగా సంజూ చెన్నై పగ్గాలు అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్పు రాజస్థాన్ జట్టుకు కూడా కొత్త ఈక్వేషన్స్ మోసుకొచ్చింది.

కెప్టెన్లుగా ముగ్గురు ఛాంపియన్లు

వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ ఈసారి ఐపీఎల్‌లో కెప్టెన్లుగా కనిపిస్తారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను నడిపిస్తుండగా, అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో, తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ముగ్గురు ప్రపంచ విజేతలు సారథులుగా వ్యవహరించడం ఈ సీజన్ కు మరింత వన్నె తెచ్చింది.

ఆరంభ పోరులో ముఖాముఖి

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు వరల్డ్ కప్ హీరోలు తలపడబోతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మైదానంలోకి దిగనున్నారు. మరోవైపు ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ (వరల్డ్ కప్ 2026 జట్టులో లేనప్పటికీ) కూడా మైదానంలో ఉండటంతో తొలి రోజే ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం. ప్రపంచ ఛాంపియన్ల మధ్య జరిగే ఈ లీగ్ పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

23 March 2026

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026

మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన అనేదే ఉండదు..

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Telangana: ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు.. తీరా పరిశీలించి చూడగా

23 March 2026

హైదరాబాద్ నగరంలోని ఫేమస్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో భక్తి పేరుతో చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపుతోంది. దేవాలయ…

TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

23 March 2026

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026

Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Telangana: ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు.. తీరా పరిశీలించి చూడగా

23 March 2026

TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

23 March 2026

IT Rules: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. కీలక మార్పులు ఇవే..

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025227

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025220

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.