అందం, అభినయం ఈ హీరోయిన్ సొంతమనే చెప్పాలి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ అంతంగా గుర్తింపు మాత్రం రావడం లేదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం తెగ ట్రై చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదండి. మోడ్రన్ డ్రస్సులతో గ్లామర్ షోలతో పిచ్చెక్కిస్తుంటుంది.
ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎవరో గుర్తుపట్టండి. తను మరెవరో కాదు.. యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన ఏక్ మినీ కథ చిత్రంలో నటించిన కావ్య థాపర్. ఈమె పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ ముఖ పరిచయమే. ముంబయిలో పుట్టి పెరిగిన కావ్య.. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి బ్రాండ్లకు మోడల్ గా వర్క్ చేసింది. 2013లో తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత 2018 ఈ మాయ పేరేమిటో తెలుగు మూవీతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది.
ఇక ఆ తర్వాత 2021లో సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో గ్లామర్ షోలతో రచ్చ చేసింది కావ్య. ఆ మధ్య వరుసగా బిచ్చగాడు2, సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రాల్లో నటించింది. అలాగే రవితేజ హీరోగా నటించిన ఈగల్ సీనియాలోనూ నటించింది.
వీటితో పాటు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో గ్లామరస్ లుక్ లో మెరిసింది కావ్య. అలాగే గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలో నటించింది. కానీ వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో ఈ చిన్నదానికి ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి.






