Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్‌ సితారే !!

25 March 2026

Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..

25 March 2026

త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! | ys jagan announced on his padayatra will start soon, made shocking comments on ap cm chandrababu

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ!
తెలంగాణ

ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ!

.By .25 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ!

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండి నాగిరెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు ఉండగా.. పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులు సమయం, ఇంధనం, క్యూ లైన్లకు స్వస్తి చెప్పవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు.

సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30శాతం రాయితీ ఒక గొప్ప అవకాశమని తెలిపారు. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని ఆయన తెలిపారు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుంది. బంకుల వద్ద బారులు తీరొద్దు.. సేఫ్ గా బస్సెక్కండి. సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి అని నాగిరెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్, పెట్రోల్ ఇబ్బందుల నుండి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TGSRTC: ఇంటి వద్దకే భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు.. జస్ట్ ఒక్క దూరంలో..

25 March 2026

Watch Video: పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో

25 March 2026

Indiramma Illu: వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్..

25 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్‌ సితారే !!

25 March 2026

ఒకప్పుడు పల్లెల్లో అపరిచితులు అడుగుపెడితే గ్రామ సింహాల అరుపులు వినిపించేవి. కానీ ఇప్పుడు భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల…

Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..

25 March 2026

త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! | ys jagan announced on his padayatra will start soon, made shocking comments on ap cm chandrababu

25 March 2026

బల్లుల బెడదతో విసిగిపోయారా? అవి గుడ్లు పెట్టే ఈ 5 ప్రదేశాలను వెంటనే శుభ్రం చేయండి..!

25 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్‌ సితారే !!

25 March 2026

Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..

25 March 2026

త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! | ys jagan announced on his padayatra will start soon, made shocking comments on ap cm chandrababu

25 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025276

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025260

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.