
ఏలూరు: అందాల పోటీలు మహానగరాల్లోనేకాదు. పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు నేటితరం యువతీ యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో జరిగిన అందాల పోటీలకు మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రముఖ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన “క్రౌన్ ఆఫ్ ఏలూరు” కార్యక్రమంలో పాల్గొనటం మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఏలూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతీ యువకులు మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోటీలో దివ్య ఆలపాటి విజేతగా నిలిచారు. ప్రముఖ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన క్రౌన్ ఆఫ్ ఏలూరు అందాల పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి, మిస్ ఏలూరు కిరీటాన్ని దక్కించుకుని విజేతగా నిలిచారు దివ్య ఆలపాటి.
దర్శకులు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు ఆలపాటి దివ్యకు ‘మిస్ ఏలూరు’ ప్రతిష్టాత్మక ట్రోఫీని, కిరీటాన్ని అందజేశారు. ర్యాంప్ వాక్, ఐక్యూ (IQ) రౌండ్లలో తనదైన శైలిలో రాణించిన దివ్య ఆలపాటి విజేతగా నిలిచారు. అలాగే, మిసెస్ ఏలూరు, మిస్టర్ ఏలూరు, కిడ్స్ విభాగాల్లో కూడా పోటీలు నిర్వహించగా, ఔత్సాహికులు భారీగా ఈ అందాల పోటీలో పాల్గొని సందడి చేశారు. మిస్ ఏలూరుగా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఏలూరు వంటి నగరంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం యువత టాలెంట్‌ను ప్రోత్సహించడమేనని మిస్ ఏలూరు విజేత దివ్య ఆలపాటి అన్నారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఫ్యాషన్ రంగ నిపుణులు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.

