Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో మీ మొక్కను కాపాడుకోండి!

26 March 2026

విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! | Visakhapatnam-SMVB Bengaluru Special Train Services Extended- here is complete details

26 March 2026

Ap Cabinet Legal Status To Amaravati,ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత, పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం – cm nara chandrababu naidu led andhra pradesh cabinet approves legal status to amaravati as capital and other decisions

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Band Melam Movie Review: బ్యాండ్ మేళం మూవీ రివ్యూ.. కోన వెంకట్‌తో కలిసి ‘కోర్ట్’ జోడీ మ్యాజిక్ చేసిందా..?
తాజా వార్తలు

Band Melam Movie Review: బ్యాండ్ మేళం మూవీ రివ్యూ.. కోన వెంకట్‌తో కలిసి ‘కోర్ట్’ జోడీ మ్యాజిక్ చేసిందా..?

.By .26 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Band Melam Movie Review: బ్యాండ్ మేళం మూవీ రివ్యూ.. కోన వెంకట్‌తో కలిసి ‘కోర్ట్’ జోడీ మ్యాజిక్ చేసిందా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Band Melam Movie Review: బ్యాండ్ మేళం మూవీ రివ్యూ.. కోన వెంకట్‌తో కలిసి ‘కోర్ట్’ జోడీ మ్యాజిక్ చేసిందా..?

మూవీ రివ్యూ: బ్యాండ్ మేళం

నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల, సాయికుమార్, యోగిత తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

స్క్రీన్ ప్లే & ఎడిటింగ్: శివ ముప్పరాజు

దర్శకత్వం: సతీష్ జవ్వాజి

నిర్మాతలు: కావ్య, శ్రావ్య

గతేడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. ఆంధ్ర నేపథ్యం నుంచి ఈసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌కి మారి ఈ జంట చేసిన ఈ మాస్ సినిమా థియేటర్లలో ఏ మేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

కథ:

తెలంగాణలోని Y పల్లెటూరులో గిరి (హర్ష్ రోషన్) తన మేనమామ కూతురు రాజీ (శ్రీదేవి)ని చిన్నప్పటి నుంచే ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. పెద్దలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కాలానుగుణంగా వారి పరిస్థితులు తారుమారవుతాయి. గిరి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి చిన్న ఇంట్లోకి మారితే, రాజీ తండ్రి (సాయికుమార్) మాత్రం బాగా డబ్బు సంపాదించి రిచ్ అవుతాడు. గిరి కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు, కానీ రాజీ మాత్రం ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అయినా సరే.. రాజీ తనదేనని గిరి అతిగా ప్రవర్తిస్తుంటాడు. ముందు టెన్త్ పాస్ అయి, మ్యూజిక్ మీద ఉన్న ఇష్టాన్ని నిరూపించుకోమని రాజీ చెబుతున్నా వినకుండా.. తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాండ్ వాయిస్తూ, తాగుతూ ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు గిరి. మరి గిరిలో మార్పు వచ్చిందా? తన బ్యాండ్‌తో యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యాడా? తన క్లాస్‌మేట్‌తో సెటిల్ అవ్వకుండా రాజీ.. గిరిని అంగీకరించిందా? అన్నదే మిగతా కథ.

కథనం:

‘కోర్ట్’ సినిమాలో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంట మ్యాజిక్ ఈసారి మాత్రం పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అసలు ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్.. అవుట్ డేటెడ్, ఓల్డ్ స్క్రిప్ట్..! విషయం లేని కథ, స్క్రీన్ ప్లేతో సినిమా చేయాలనుకోవడమే దర్శక నిర్మాతలు చేసిన సాహసం. సిల్లీగా ఉండే ప్లాట్.. ఏ మాత్రం ఆకట్టుకోని పాటలు, సీన్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. కోన వెంకట్ లాంటి సీనియర్ రైటర్ ఉన్నా కూడా కథలో ఎలాంటి కొత్తదనం లేదు, ప్రేక్షకుడిని కట్టిపడేసే ఎమోషనల్ కనెక్ట్ అసలే లేదు. సీరియస్ సన్నివేశాల్లోనూ కామెడీ చేయాలనుకోవడం ఏంటనేది అర్థం కాని విషయం. మేనకోడలిపై విపరీతమైన ప్రేమ పెంచుకుని, ఆమె తనకే సొంతం అనుకునే కుర్రాడి కాన్సెప్ట్ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల క్రితమే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కనీసం ఆ పాత కథనైనా కొత్తగా తీశారా అంటే అదీ లేదు. కథ, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న సతీష్ జవ్వాజి మేకింగ్ చాలా ఔత్సాహికంగా అనిపిస్తుంది. సినిమా నిడివి కేవలం 2.20 గంటలే అయినా, థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ‘బ్యాండ్ మేళం’ అనే టైటిల్ జస్టిఫికేషన్ కోసం ప్రతీ 10 నిమిషాలకు ఓసారి హీరో అండ్ గ్యాంగ్ బ్యాండ్ వాయిస్తూ ఉంటారు. వీక్ స్క్రిప్ట్ ఏ దశలోనూ ఆకట్టుకోదు. క్లైమాక్స్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ సెకండాఫ్ అని తేడా లేదు.. విషయం లేని కథ, కథనాలతో బ్యాండ్ మేళం ఎక్కడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు.

నటీనటులు:

హర్ష్ రోషన్ క్యారెక్టరైజేషన్ కాస్త హైపర్‌గా అనిపిస్తుంది. కోర్టులో చాలా సెటిల్డ్‌గా కనిపించిన ఈ కుర్రాడు ఈసారి మాస్ హీరోగా రెచ్చిపోయాడు. లౌడ్‌గా, అసహజంగా అనిపించాడు. శ్రీదేవి ఆపల్ల ఉన్నంతలో తన పరిమితమైన పాత్రలో పర్వాలేదనిపించింది కానీ, ఆమెకు పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ దక్కలేదు. సాయి కుమార్, యోగిత, గోపరాజు లాంటి నటులు పర్లేదు.. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఓకే.

టెక్నికల్ టీం:

ఒక ‘మ్యూజిక్ బ్యాండ్’ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా అంటే ఆల్బమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ విజయ్ బుల్గానిన్ సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు. డీఓపీ సతీష్ ముత్యాల కెమెరా వర్క్ పర్లేదు. ఎడిటింగ్ అయితే వీక్.. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పుబట్టలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి.. దర్శకుడు సతీష్ జువ్వాజీ రాసుకున్న కథే మైనస్.. చాలా ఓల్డ్ స్టోరీ ఇది.. దాంతో ఎక్కడా మనోడి దర్శకత్వ ప్రతిభ చూపించేంత సన్నివేశాలు కూడా లేవు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బ్యాండ్ మేళం.. సౌండ్ లేదు..!

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో మీ మొక్కను కాపాడుకోండి!

26 March 2026

విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! | Visakhapatnam-SMVB Bengaluru Special Train Services Extended- here is complete details

26 March 2026

Kitchen Hacks: టమోటాలు త్వరగా పాడవుతున్నాయా?.. ఇలా స్టోర్‌ చేస్తే వారమైన చెక్కుచెదరవంతే

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో మీ మొక్కను కాపాడుకోండి!

26 March 2026

నీటి పీడనంతో శుభ్రం చేయడం (Water Spray): పురుగులు తక్కువగా ఉన్నప్పుడు, పైపుతో నీటిని వేగంగా (Pressure) మొక్కపై చల్లండి.…

విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! | Visakhapatnam-SMVB Bengaluru Special Train Services Extended- here is complete details

26 March 2026

Ap Cabinet Legal Status To Amaravati,ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత, పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం – cm nara chandrababu naidu led andhra pradesh cabinet approves legal status to amaravati as capital and other decisions

26 March 2026

Kitchen Hacks: టమోటాలు త్వరగా పాడవుతున్నాయా?.. ఇలా స్టోర్‌ చేస్తే వారమైన చెక్కుచెదరవంతే

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో మీ మొక్కను కాపాడుకోండి!

26 March 2026

విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! | Visakhapatnam-SMVB Bengaluru Special Train Services Extended- here is complete details

26 March 2026

Ap Cabinet Legal Status To Amaravati,ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత, పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం – cm nara chandrababu naidu led andhra pradesh cabinet approves legal status to amaravati as capital and other decisions

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025287

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025274

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.