
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు.. వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాలున్న బంగారు స్వామి.. అలంకార ప్రియుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఒక భక్తుడు ఒళ్లంతా బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన సూర్య భాయ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.. శ్రీవాణి దర్శన సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించిన సూర్య తిరుమల ఆలయం ఎదుట భక్తులను ఆకట్టుకున్నాడు.
మెడలో కిలోల కొద్ది బంగారు గొలుసులు, చేతికి కడియాలు, ఉంగరాలు ధరించిన సూర్యతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గతేడాది శ్రీవారిని దర్శించుకున్న సూర్య దేశంలో ఎవరికీ లేని బంగారు కడియాన్ని చేతికి ధరించాలని మొక్కుకున్నాడు. అదే రీతిలో శ్రీవారి నామాలు, కిరీటం శంకు చక్రాలు ఉన్న బంగారు కడియం ధరించి శ్రీవారిని దర్శించుకున్నాడు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలను నెరవేరుతాయని పేర్కొన్నారు. అయితే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన సూర్య వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

