Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL 2026: మరోసారి ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటికి.. SRHపై బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్

29 March 2026

Grey Divorce: 50 ఏళ్ల వయసులో విడాకులా? భారత్‌లో పెరుగుతున్న ‘గ్రే డివోర్స్’ ట్రెండ్!

29 March 2026

Tdp Flag Reversed Chittoor,TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. – flag reversed in 44 years of tdp foundation day event chittoor

29 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»PM Modi: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
జాతీయం

PM Modi: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ

.By .27 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
PM Modi: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


PM Modi: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ

పవిత్రమైన రామ నవమి పర్వదినం రోజున, నలుమూలల నుండి అయోధ్యలోని రామనగరికి విచ్చేసిన భక్తులు ఒక అసాధారణమైన క్షణానికి సాక్ష్యమిచ్చారు. శుక్రవారం (మార్చి 27) సరిగ్గా 12 గంటలకు, అయోధ్యలోని అద్భుతం చోటు చేసుకుంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దారు. సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై పడగానే, ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలో ఉన్న భక్తులు ఆనందంతో, ఉత్సాహంతో పొంగిపోయారు. ఆలయం లోపల ఉన్న రామ్ లల్లా విగ్రహం నుదుటిపైకి శాస్త్రీయ పద్ధతిలో సూర్యకిరణాన్ని ప్రసరింపజేశారు. ఆలయ ప్రాంగణమంతా “జై శ్రీ రామ్” నినాదాలతో మారుమోగింది. ఈ ఏడాది అయోధ్యలో జరుగుతున్న ఈ ఘనమైన వేడుకకు, రామ జన్మభూమి ఆలయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూర్య తిలకం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అద్దాలు, కటకాలతో కూడిన అధునాతన వ్యవస్థ ద్వారా, సూర్యకాంతి గర్భగుడిలోకి ప్రవేశించి కొన్ని నిమిషాల పాటు దేవతామూర్తి రామ్ లల్లా నుదుటిపై ప్రకాశవంతమైన తిలకాన్ని ఏర్పడింది. సూర్య తిలకం వేడుక సమయంలో, సూర్యకిరణాలు పైనుంచి గొట్టాల ద్వారా రామ మందిరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అవి అద్దాల ద్వారా పరావర్తనం చెంది, రామ్ లల్లా విగ్రహం నుదుటిపై 75 మిల్లీమీటర్ల వృత్తాకార తిలకాన్ని ఏర్పరుస్తాయి. ఈ వేడుక దైవిక ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలవడంతో పాటు, సంప్రదాయం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. భక్తుల భాగస్వామ్యం మరింత విస్తృతం చేసేందుకు, ఆలయ అధికారులు అయోధ్య వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు, దీంతో వేలాది మంది భక్తులు ఆ క్షణాన్ని వీక్షించేందుకు వీలు కలిగింది.

రామ్ లల్లాకు జరిగిన సూర్య తిలక్ ప్రదానోత్సవాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.రామ్ లల్లా సూర్య తిలకం దర్శనంతో పులకించిపోయారు. సూర్య తిలకం ప్రదానోత్సవాన్ని ప్రధాని అభినందించారు.

వీడియో ఇక్కడ చూడండి.. 

అంతకుముందు, చైత్ర నవరాత్రి అష్టమి సందర్భంగా, రామ జన్మభూమి ఆలయ సముదాయంలోని సూర్య దేవాలయంలో పురోహితులు వైదిక సంప్రదాయాల ప్రకారం “ధ్వజారోహణ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై “ఓం” చిహ్నం ఉన్న కాషాయ జెండాను ఎగురవేశారు. ఇక ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచే అయోధ్యకు భక్తుల తాకిడి అధికంగా కనిపించింది. వేలాది మంది సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి, అపారమైన ఉత్సాహంతో ఈ మతపరమైన ఆచారాలలో పాల్గొన్నారు. పుణ్యస్నానం చేసిన అనంతరం, భక్తులు రామ మందిరంతో సహా పలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మహిళా ఖాతాలో వచ్చి పడ్డ లక్ష్మీదేవి.. ఏకంగా రూ. 10 కోట్లు జమ.. ఏం చేసిందో తెలుసా?

29 March 2026

వదంతులకు దూరంగా ఉండండి.. ఏ కష్టమొచ్చిన కలిసికట్టుగా ఎదురుకుందాంః ప్రధాని మోదీ!

29 March 2026

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం అనుమతి

29 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IPL 2026: మరోసారి ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటికి.. SRHపై బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్

29 March 2026

Sunrisers Hyderabad Playoffs: ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ నాణ్యతను తక్కువ చేసి మాట్లాడారు.…

Grey Divorce: 50 ఏళ్ల వయసులో విడాకులా? భారత్‌లో పెరుగుతున్న ‘గ్రే డివోర్స్’ ట్రెండ్!

29 March 2026

Tdp Flag Reversed Chittoor,TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. – flag reversed in 44 years of tdp foundation day event chittoor

29 March 2026

Telangana: తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరికీ ఉచితంగా బ్రేక్ ఫాస్ట్.. అమల్లోకి వచ్చేసింది..

29 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IPL 2026: మరోసారి ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటికి.. SRHపై బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్

29 March 2026

Grey Divorce: 50 ఏళ్ల వయసులో విడాకులా? భారత్‌లో పెరుగుతున్న ‘గ్రే డివోర్స్’ ట్రెండ్!

29 March 2026

Tdp Flag Reversed Chittoor,TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. – flag reversed in 44 years of tdp foundation day event chittoor

29 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025393

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025358

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.