Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

28 March 2026

టార్గెట్ ఒకటి… రిజల్ట్ మరోటి… ప్రపంచానికి షాక్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ స్టోరీ !! | success story behind Viagra tablet first making and after results which shock the entire world

28 March 2026

“ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం” | jdvance Confirms US Will Leave Iran Soon: Military to Withdraw Once Current Business Is Finished

28 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Heatwave Alerts,AP Weather: బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త.. 35 మండలాల్లో రేపు (మార్చి 29) తీవ్ర వడగాల్పులు.. – apsdma weather forecast severe heatwaves across 35 mandals on march 29th 2026 in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Ap Heatwave Alerts,AP Weather: బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త.. 35 మండలాల్లో రేపు (మార్చి 29) తీవ్ర వడగాల్పులు.. – apsdma weather forecast severe heatwaves across 35 mandals on march 29th 2026 in andhra pradesh

.By .28 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Heatwave Alerts,AP Weather: బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త.. 35 మండలాల్లో రేపు (మార్చి 29) తీవ్ర వడగాల్పులు.. – apsdma weather forecast severe heatwaves across 35 mandals on march 29th 2026 in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రోజున ( మార్చి 29) 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 87 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం ఏపీలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత మార్కాపురం జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. 48 చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

AP Weather
(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఉక్కబోత, వేడిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రేపు (మార్చి 29) రాష్ట్రవ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 87 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా ,పోలవరం, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

తీవ్ర వడగాల్పులు వీచే మండలాల జాబితా..

పార్వతీపురం మన్యం జిల్లా:

బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం

విజయనగరం జిల్లా:

బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, మెరకముడియం, రాజాం, రామభద్రాపురం, రేగిడిఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు

ఎన్టీఆర్ జిల్లా:

జి. కొండూరు. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాలు

పోలవరం జిల్లా:

చింతూరు. కూనవరం మండలాలు

శ్రీకాకుళం జిల్లా:

బూర్జ, హిర మండలాలు

అల్లూరి జిల్లా:

అనంతగిరి మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శనివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 48 చోట్ల.. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు,టోపీ వంటివి ధరించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే కాటన్ దుస్తులు ధరించాలని.. మంచినీళ్లు ఎక్కువగా తాగాలని సూచించింది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని.. వీలైతే వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎండ సమయంలో బయటకు రాకపోవటమే మంచిదని సూచించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి