International
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం నెల రోజులుగా సాగూతూనే ఉంది. రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఓవైపు చర్చలు అంటూ.. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తామని.. ఇరాన్ ను విడిచి వెళ్తామని తెలిపారు.
ఇరాన్ తో సంవత్సరాలపాటు యుద్ధం చేయాలని అమెరికా అనుకోవడం లేదని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ లో తమ లక్ష్యాలను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టామని తెలిపారు. అణు కార్యక్రమాలకు పాల్పడకుండా ఇరాన్ ను అన్ని విధాలుగా బలహీనపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. ఆ ప్రయత్నాలు పూర్తికాగానే అక్కడి నుంచి అమెరికా వెళ్లిపోతుందని పేర్కొన్నారు.
అయితే ఇరాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కు వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు ధరలు తగ్గుముఖం పడతాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చముర ధరల పెరుగుదలను తాను అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ తో అమెరికా యుద్ధం ముగించిన తర్వాత కూడా అక్కడి పరిస్థితులు స్థిరంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారని జేడీ వాన్స్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ట్రంప్ తగిన చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు. ఈ మేరకు అమెరికన్ కన్జర్వేటీవ్ పొలిటికల్ కామెంటేటర్ బెన్నీ జాన్సన్ తో జరిగిన సంభాషణలో జేడీ వాన్స్ ఈ కీలక లు చేశారు.

