Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. అప్పటిలోపు ప్రతి ఒక్కరికీ ఇళ్లు..

30 March 2026

Cooler Smell: కూలర్‌ నుంచి కంపు వాసన వస్తుందా? కారణం ఇదే కావచ్చు..! ఎలా పోగొట్టాలంటే?

30 March 2026

Pruthviraj Yadav On Chandrababu Pawan Kalyan,చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌ – pruthviraj yadav questioning what business chandrababu and pawan kalyan have in hyderabad

30 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Anna Prasadam Devotees Huge Rush,తిరుమలలో అన్నప్రసాదానికి భక్తుల తాకిడి.. పది రోజుల్లో పెరిగిన రద్దీ, ఎంతమంది తిన్నారంటే! – devotees huge rush in tirumala anna prasadam center due to gas crisis
ఆంధ్రప్రదేశ్

Tirumala Anna Prasadam Devotees Huge Rush,తిరుమలలో అన్నప్రసాదానికి భక్తుల తాకిడి.. పది రోజుల్లో పెరిగిన రద్దీ, ఎంతమంది తిన్నారంటే! – devotees huge rush in tirumala anna prasadam center due to gas crisis

.By .30 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Anna Prasadam Devotees Huge Rush,తిరుమలలో అన్నప్రసాదానికి భక్తుల తాకిడి.. పది రోజుల్లో పెరిగిన రద్దీ, ఎంతమంది తిన్నారంటే! – devotees huge rush in tirumala anna prasadam center due to gas crisis
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Anna Prasadam Huge Rush: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తిరుమలపై పడింది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కొండపై ఉన్న ప్రైవేట్‌ హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీంతో భక్తులు టీటీడీ అన్నప్రసాద కేంద్రాలకు క్యూ కట్టారు. గత కొద్దిరోజులుగా అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో రద్దీ కనిపిస్తోంది. గత పదిరోజుల్లో ఈ సంఖ్య బాగా పెరిగింది. టీటీడీ ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది.

హైలైట్:

  • తిరుమలలో అన్నప్రసాదానికి భక్తుల తాకిడి
  • హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూతపడటంతో
  • గత పదిరోజుల్లో భారీగా పెరిగిన భక్తుల సంఖ్య
Tirumala Anna Prasadam
తిరుమల అన్నప్రసాదానికి భక్తుల రద్దీ(ఫోటోలు– Samayam Telugu)
తిరుమలలో గత రెండు వారాలుగా భక్తుల రద్దీ పెరిగింది.. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొండపై భక్తుల రద్దీ మాత్రమే కాదు.. శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించే వారి సంఖ్య పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా తిరుమలలోని హోటల్స్, ఫాస్‌ఫుడ్ సెంటర్లపై కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువమంది భక్తులు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరిస్తుండటంతో రద్దీ పెరిగిందని చెబుతున్నారు.గతేడాది మార్చి 16 నుంచి 25 వరకు ఉదయం అల్పాహారం లక్షా 27వేల 960మంది స్వీకరిస్తే.. ఈ ఏడాది మార్చి 16 నుంచి 25 వరకు ఉదయం అల్పాహారం లక్షా 32 వేల 270 మంది స్వీకరించారు. 2025 మార్చి 16 నుంచి 25 వరకు మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని 5,95,032 మంది భక్తులు స్వీకరిస్తే.. ఈ ఏడాది మార్చి 16 నుంచి 25 వరకు మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ఏకంగా 7,41,340 మంది భక్తులు స్వీకరించారు. ఉదయం అల్పాహారానికి వేల సంఖ్యలో భక్తుల సంఖ్య పెరిగితే.. మధ్యాహ్నం, రాత్రి భోజనం తిన్న వారి సంఖ్య దాదాపు లక్షన్నర వరకు పెరిగింది. వెంగమాంబ కేంద్రం మాత్రమే కాదు.. టీటీడీ కొండపై భక్తుల రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదాన్ని అందిస్తోంది.. అక్కడ భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.

తిరుమలలోని హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హోటల్స్‌లో ఫుడ్ మెనూలో మార్పులు చేశారు.. కొన్ని ఐటమ్స్‌ను తొలగించారు. అలాగే కొన్ని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల టైమింగ్స్ మార్చేశారు. పెరుగన్నం, సాంబార్ రైస్ వంటి వాటిని మాత్రమే మెనూలో ఉంచారు. అయితే తిరుమలలోని 40కిపైగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వరుసగా మూతపడ్డాయి. కొందరు మాత్రం ఉన్న గ్యాస్‌తో సరిపెట్టుకుని అవసరమైన మేరకు వాడుకుంటూ హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నడుపుతున్నారు. ఈ క్రమంలో భక్తులు అన్నప్రసాదం వైపు మొగ్గు చూపుతున్నారు.. అందుకే రద్దీ కనిపిస్తోంది.

తిరుమలలో గ్యాస్ సరఫరాను టీటీడీ పర్యవేక్షిస్తోంది.. అన్నప్రసాదాల తయారీకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. టీటీడీకి సంబంధించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, వకుళమాత, శ్రీఅక్షయ కేంద్రాల్లో అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ సరఫరా ఆగకుండా చూస్తున్నారు. టీటీడీ రిక్వెస్ట్‌తో గ్యాస్ కంపెనీలు సరఫరాను కొనసాగిస్తున్నాయి. దీంతో టీటీడీ అన్నప్రసాద వితరణకు ఇబ్బందులు రావడం లేదు. భక్తులు కూడా అన్న ప్రసాద కేంద్రాలకు వెళుతున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. అప్పుడు టీటీడీ అన్నప్రసాద కేంద్రాలకు రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి