Andhra Pradesh
oi-Sai Chaitanya
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణా లతో తన నిర్ణయాల్లోనూ మార్పులు చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాల అమలు కు సిద్దవుతున్నారు. కూటమి తామే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతుంటే… 2029 లో అధికారం తమదేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ప్లీనరీతో పాటుగా తన పాదయాత్ర పైన జగన్ కొత్త ప్రణాళికల పై కసరత్తు కొనసాగిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని జగన్ చెబుతున్నారు. తొలుత 2029 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో ఈ ప్రణాళిలో మార్పు దిశగా ఆలోచన జరుగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్ తో వరుస సమావేశాల నిర్వహణకు షెడ్యూల్ పైన కసరత్తు జరుగుతోంది. అదే సమయం లో అన్ని వర్గాలతోనూ ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో డిసైడ్ అయిన పాదయాత్ర షెడ్యూల్ కంటే ముందే తన పాదయాత్ర 2.0 ప్రారంభించేందుకు జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీ ప్లీనరీ.. జిల్లా పర్యటనలు.. పాదయాత్ర పై కసరత్తు
2027 జూలై నుంచి పాదయాత్ర ప్రారంభించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో విజయవాడ – గుంటూరు మధ్యలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పైన జగన్ వచ్చే వారం అధికారికంగా ప్రకటన చేస్తారని పార్టీ నేతల సమాచారం. 2027 జూలై నుంచి ఏడాదిన్నార కాలం పాదయాత్ర కొనసాగనుంది. ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తామని జగన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో ‘మావిగన్’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ గా జగన్ చెబుతు న్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదని, ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో.. జగన్ జిల్లాల పర్యటనలు.. పార్టీ ప్లీనరీ.. పాదయాత్ర 2.0 పైన ఈ నెలలోనే పూర్తి స్పష్టత ఇచ్చే దిశగా కసరత్తు కొనసాగుతోంది.

