Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

11 April 2026

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

11 April 2026

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

11 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
జాతీయం

మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

.By .10 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

మహిళా రిజర్వేషన్ల అంశం కేవలం రాజకీయ క్రెడిట్ కోసం కాదని, అది భారతీయ మహిళల గౌరవానికి, ప్రాతినిధ్యానికి, వారి హక్కులకు సంబంధించిన అంశమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పదేపదే చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడుతూ, దేశ మహిళలకు ఇప్పుడు కావలసింది ఆచరణాత్మక ఫలితాలే తప్ప, అమలుకు నోచుకోని వాగ్దానాలు కావని హితవు పలికారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ డిమాండ్ వల్ల రాలేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పం వల్లే సాధ్యమైందని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. గత 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని చర్చలకే పరిమితం చేయకుండా, 106వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశామని ఆయన వివరించారు. ఇది కేవలం ప్రతిపాదన కాదని, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భాగమని ఆయన స్పష్టం చేశారు.

రిజర్వేషన్ల అమలుపై ప్రతిపక్షాల ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. తదుపరి జనాభా గణన తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో(డిలిమిటేషన్) మహిళా రిజర్వేషన్ల అమలు ముడిపడి ఉందని తెలిపారు. ఇది రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన విషయం కాదని, దేశంలోని ఫెడరల్ బ్యాలెన్స్‌ను కాపాడటానికి, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి తీసుకున్న రాజ్యాంగ నిర్ణయమని వివరించారు. 2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గాల సంఖ్యను పెంచే క్రమంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రం గొంతు నొక్కకుండా, మహిళలకు అర్థవంతమైన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సంస్కరణ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా మహిళా సాధికారతపై చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంటులో ఈ చారిత్రాత్మక సంస్కరణ అమలుకు సహకరించాలని ఆయన కోరారు. అనవసర జాప్యం చేయకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని సూచించారు. దేశ మహిళలు ఫలితాలను కోరుకుంటున్నారని, కాలయాపనను కాదని ఆయన తెలిపారు.

Shri Mallikarjun @kharge Ji,

Women’s reservation is not about political credit; it is about dignity, representation and the rightful empowerment of women. India’s women deserve outcomes, not recurring promises that never translate into reality.

Let us be absolutely clear on…

— Dharmendra Pradhan (@dpradhanbjp) April 10, 2026





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Village: ఆ ఊరిలో వింత రూల్.. బూతులు మాట్లాడితే ఫైన్, లేదా పనిష్మెంట్.. ఎక్కడంటే?

11 April 2026

అందరికీ సమాన అవకాశాలు, ఒకే చట్టం.. బెంగాల్‌లో యూసీసీని అమలు చేసి తీరుతామన్న అమిత్ షా

11 April 2026

Two-Wheeler Ban: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..! ఇదిగో పూర్తి వివరాలు

11 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

11 April 2026

ఎండలు పెరుగుతున్న వేళ సరీసృపాలు వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటు ఆహారం, ఇటు చల్లదనాన్ని వెతుక్కుంటూ నివాస ప్రాంతాల్లోకి…

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

11 April 2026

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

11 April 2026

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే 100 శాతం పక్కా రిజల్ట్

11 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

11 April 2026

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

11 April 2026

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

11 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025491

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025441

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.