Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

12 April 2026

MI vs RCB: ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు

12 April 2026

అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ | iran Warns Trump: Enemy Will Be Trapped in Deadly Strait of Hormuz Vortex as Tensions Reach Peak

12 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Somireddy Praised Allipuram Kusumamba,అమ్మా ఆకలంటే.. లేదన్న మాట రాదు.. మరో డొక్కా సీతమ్మ, మా అల్లీపురం కుసుమాంబ: సోమిరెడ్డి – allipuram kusumamba is another dokka seethamma somireddy chandra mohan reddy praised the woman who is appeasing the hunger of tribal
ఆంధ్రప్రదేశ్

Somireddy Praised Allipuram Kusumamba,అమ్మా ఆకలంటే.. లేదన్న మాట రాదు.. మరో డొక్కా సీతమ్మ, మా అల్లీపురం కుసుమాంబ: సోమిరెడ్డి – allipuram kusumamba is another dokka seethamma somireddy chandra mohan reddy praised the woman who is appeasing the hunger of tribal

.By .12 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Somireddy Praised Allipuram Kusumamba,అమ్మా ఆకలంటే.. లేదన్న మాట రాదు.. మరో డొక్కా సీతమ్మ, మా అల్లీపురం కుసుమాంబ: సోమిరెడ్డి – allipuram kusumamba is another dokka seethamma somireddy chandra mohan reddy praised the woman who is appeasing the hunger of tribal
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అన్నార్థుల ఆకలి తీరుస్తూ.. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న ఓ మహిళను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సత్కరించారు. ఆమె ఇంటికి వెళ్లిన సోమిరెడ్డి.. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అల్లీపురం కుసుమాంబ.. నిత్యం 20 మంది ఆకలి తీరుస్తున్నారని ప్రశంసించిన సోమిరెడ్డి.. మరో డొక్కా సీతమ్మగా అభివర్ణించారు. గిరిజనుల కోసం ఆమె చేస్తున్న సేవను అభినందించారు.

Somireddy
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను పంచుకునే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరో పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. గుర్తు చేసుకోవటమే కాదు ఏకంగా వారి ఇంటికి వెళ్లి సత్కరించారు.ఆ వివరాలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు సోమిరెడ్డి. మరో డొక్కా సీతమ్మ .. మా అల్లీపురం కుసుమాంబ అంటూ.. ఓ మహిళ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ఆమె సేవా గుణాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశంసించారు. ఆమెను సత్కరించి. జ్ఞాపికతో బహుకరించారు.

” మా స్వగ్రామం అల్లీపురంలో మెయిన్ రోడ్డు పక్కనే ఒకప్పుడు మాకు ఓ మామిడితోట ఉండేది. ఇప్పుడు ఆ తోట బ్రాహ్మణవీధిగా మారింది. ఆ వీధిలో మాకు అత్యంత ఆత్మీయులైన రఘురామయ్య, కుసుమాంబ దంపతుల కుటుంబం ఉంది. వారి గురించి నాకు ఓ అద్భుతమైన విషయం తెలిసి స్వయంగా ఇంటికి వెళ్లి సత్కరించి వచ్చాను. కుసుమాంబ నిజంగా ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మే..మరో డొక్కా సీతమ్మే.. రఘురామయ్య 50 ఏళ్ల క్రితం మా శ్రీనివాసమహల్లో ఉద్యోగి. ఆ తర్వాత వైద్యశాఖలో ఉద్యోగం పొందారు. కుసుమాంబను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరూ మంచిగా స్థిరపడ్డారు. రఘురామయ్య కూడా రిటైర్ అయ్యారు.”

” కుసుమాంబ అందరిలా తన బిడ్డలు, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా ఉండటం వరకే పరిమితం కాలేదు..ఆకలితో వచ్చిన వారి కడుపునింపి అమ్మగా నిలుస్తున్నారు. ఆమె ఇంటికి ఏ సమయంలో ఎవరు వచ్చి అమ్మా ఆకలిగా ఉందంటే.. అప్పటికప్పుడు వండి అయినా వడ్డిస్తారు. ఎవరు ఎప్పుడు వచ్చినా.. అన్నం లేదు అనే మాట ఆమె నోటివెంట రాదు. నిత్యం 20 మందికి పైగా ఆకలి తీరుస్తారు. వీరిలో ఎక్కువ మంది గిరిజనులే. కేవలం అన్నం పెట్టడమే కాదు. వేసవిలో పాదరక్షలు, వర్షాకాలంలో పేదలకు గొడుగులు అందిస్తారు. అలాగే అనారోగ్యంతో వచ్చిన వారికి రఘురామయ్య ఉచితంగా మందులు అందిస్తారు. ” అంటూ సోమిరెడ్డి వీరి వివరాలు పంచుకున్నారు.

వీరి సేవా దృక్ఫథం గురించి తెలియగానే గ్రామస్తులతో కలిసి రఘురామయ్య నివాసానికి వెళ్లానన్న సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి.. కుసుమాంబకు చిరుసత్కారం చేసినట్లు తెలిపారు. ఆమె చేసే సేవ ముందు తమ సత్కారం చాలా చిన్నదని.. అన్నార్తుల ఆకలి తీరుస్తున్న కుసుమాంబ – రఘురామయ్య దంపతులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సోమిరెడ్డి కోరుకున్నారు. ఈ నేపథ్యంలో కుసుమాంబను ప్రశంసిస్తూ సోమిరెడ్డి ట్వీట్‌కు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఆకలితో వచ్చే వారి కడుపు నింపటం కంటే గొప్ప సేవ లేదని అభినందిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి