ప్రముఖ వ్యాపారవేత్త జేఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుల్ఫీ రావ్జీ కుమార్తె ఈ జైనబ్ రవ్జీ. జుల్ఫీ రావ్జీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించారు. కేబినెట్ మంత్రులతో సమాన ర్యాంక్ కలిగిన పోస్టులో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా జుల్ఫీ రావ్జీ వ్యవహరించారు.ఈ సమయంలో ఆయన మంత్రులతో సమానంగా పే అండ్ అలవెన్స్ పొందారు. జుల్ఫీ రావ్‌జీకి మంత్రులతో సమానంగా కారు, ల్యాప్‌టాప్, ఫర్నీచర్, మెడికల్ రీయింబర్స్మెంట్, ప్రైవేట్ సెక్రటరీ, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జామేదర్, ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్లు వంటి సౌకర్యాలు కల్పించారు.
అయితే మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా కేబినెట్ ర్యాంకుతో ఓ వ్యక్తిని, ఓ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అప్పట్లో అదే తొలిసారి. అయితే మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం జుల్ఫీ రావ్జీని ఆ పదవిలో నియమించింది. ఇక జుల్ఫీ రావ్జీ కుమారుడు జైన్ రావ్జీ కూడా వ్యాపారవేత్త. జేఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది.
ఇక జైనబ్ రావ్జీ విషయానికి వస్తే ఈమె ఒక ఆర్టిస్ట్. ఇండియా, దుబాయ్, లండన్‌లో ఎక్కువగా ఉంటారట. అఖిల్, జైనబ్ రావ్జీ తొలిసారిగా రెండేళ్ల కిందట కలుసుకున్నారని సమాచారం. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆ ప్రేమబంధాన్ని పెళ్లిబంధంగా మార్చుకుంటున్నారు.