కన్య: రాశ్యధిపతి బుధుడు ప్రస్తుతం పంచమ స్థానంలో, మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. బుధ గ్రహానికి మకర, కుంభ రాశులు మిత్ర క్షేత్రా లైనందువల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది.

