బద్వేలు
విద్యార్థులు పరిశోధనా దృక్పథాలను మెరుగుపరచి ప్రయోగాల్లో రాణించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఏర్పాటు చేయడం జరిగిందని డీఈఓ శివప్రకాష్ రెడ్డి మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లాలోని పాఠశాలప్రధానోపాధ్యాయులకు వివిఎంపై అవగాహన సదస్సు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవివియం పేరుతో ఏటా చాతీయ స్థాయిలో ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో విజ్ఞాన ప్రసార విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు భారతద దేశంలోని సి ఎస్ ఐ ఆర్ బార్క్ డిఆర్డిఓ లతో పాటు ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ బైపిసి చదువుతున్న విద్యార్థులకు స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీ సిలబస్ వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. జూనియర్(6 నుండి 8 తరగతులు) మరియు సీనియర్(9 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు) విభాగాలలో ఓపెన్ బుక్ పద్ధతిలో ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రస్తుతం 2024 – 25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 15
నమూనా పరీక్ష అక్టోబర్ 10న రిజిస్ట్రేషన్ మే 19 నుంచి మొదలయ్యాయి సెప్టెంబర్ 15 వరకు.ఫీజు ₹ 200 పాఠశాల స్థాయి పరీక్ష : అక్టోబర్ 23 మరియు 27 తేదీలలో ఏదో ఒక రోజు లాగిన్ అయిన ఒకటిన్నర గంట లోపు పరీక్ష పూర్తి అవ్వాలిరాష్ట్రస్థాయి పరీక్ష నవంబర్ 26 లేదా డిసెంబర్ 3,10 మరియు 17వ తేదీల్లో సమయం పది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రతి విద్యార్థి ఒకసారి మాత్రమే లాగిన్ అవ్వాలి జాతీయస్థాయిలో విజేతకు ₹25వేల బహుమతి: ఈ పోటీ పరీక్షలో జాతీయస్థాయి విజేతలకు ప్రథమ బహుమతి గా 25000 ద్వితీయ బహుమతిగా 15000 తృతీయ బహుమతిగా పదివేల తో పాటు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందజేస్తారు
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2020 నాలుగు 25 జాతీయ డి ఆర్ డి ఓ ఇస్రో సి ఎస్ ఐ ఆర్ వంటి ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు పరిశోధనా సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాం కింద ఏడాది పాటు నెలకు ఉపకార వేతనంగా అందజేస్తారు దరఖాస్తు ఇలా..!
2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్థి విజ్ఞాన్ మంథని పరీక్ష రాసేందుకువెబ్సైట్లో నమోదు అవ్వాలి దరఖాస్తులు గూగుల్ ప్లే స్టోర్ లో వివిఎం ఆప్ ను డౌన్లోడ్ చేసి నింపాలి
వంద మార్కులకు పరీక్ష:
జూనియర్ సీనియర్ విభాగాలకు 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 8 ప్రధాన ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. గణితం, సామాన్య శాస్త్రం, పాఠ్యపుస్తకాలకు సంబంధించి అంశాలపై 50% బహుళైస్చిక ప్రశ్నలు సెక్షన్ ‘A’ లో, ఉంటాయివిజ్ఞాన శాస్త్ర రంగంలో భారతదేశ మేధావుల* కృషి పై 20% శాంతి స్వరూప్ పట్నాగర్ జీవిత చరిత్ర నుంచి 20%, మరియు లాజికల్ &రీజనింగ్ పై 10% బహుళఐశ్చిక ప్రశ్నలు ఉంటాయి.
పూర్తి వివరాలకు వివిఎం వెబ్సైట్లో చూసుకోవచ్చు.పాఠశాల స్థాయిలో ఆన్లైన్ పరీక్ష రోజు విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ లాప్టాప్ డెస్క్ టాప్ డిజిటల్ పరికరాలలో ఏదైనా ఒకదాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. వి. వి. ఎం. స్టడీ మెటీరియల్ వెబ్సైట్లో ఇప్పటికే పొందుపరిచారు. అన్నమయ్య జిల్లా డీఈవో, యు శివ ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా వి.వి.ఎం కోఆర్డినేటర్ రాజారత్నం వి.వి.ఎం. బ్రోచర్లను విడుదల చేయించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల హెడ్మాస్టర్లు ప్రిన్సిపల్ లు ఒక గైడ్ టీచర్ ని నియమించి ఈ ప్రతిభా అన్వేషణ పరీక్షకు పిల్లలను రిజిస్టర్ చేయించి సన్నద్ధ పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ ఓబుల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు, ఆపస్ రాష్ట్ర కార్యదర్శి మరియు కౌశల్ కోఆర్డినేటర్ మధుమతి, కౌశల్ జాయింట్ కోఆర్డినేటర్ గోవింద్ నాగరాజు, అర్చనా కాలేజ్ కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఏ ఓ యం సమీవుల్లా పాల్గొన్నారు.