సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు స్వయం కృషితో ఎదిగిన వారే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్స్ గా మారిన వారే. ఈ స్టార్ నటుడు కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. తల్లిదండ్రులు కన్నుమూయడంతో 18 ఏళ్లకే రోడ్డుపైకొచ్చాడు. మొదట తండ్రి క్యాన్సర్ తో కన్నుమూశాడు. ఆ తర్వాత రెండేళ్లకు తల్లి కూడా మూత్రపిండాల జబ్బుతో ప్రాణాలు విడిచింది. వీటికి తోడు చట్టపరమైన ఇబ్బందుల కారణంగా సొంతింటిని కోల్పోయి రోడ్డున పడ్డాడు. తనకు చేతనైన పని చేస్తూ, దొరికింది తింటూ కడుపు నింపుకొన్నాడు. జీవనోపాధి కోసం బస్సులో లిప్ స్టిక్ నెయిల్ పాలిష్ అమ్మాడు. అలాగే ఒక ఫోటో ల్యాబ్‌లో కూడా పనిచేశాడు. అదే క్రమంలో సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ సినిమాలో అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. ఆతర్వాత తన జీవితమే మారిపోయింది. స్టార్ నటుడిగా బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను మరెవరో కాదు ఆ మధ్యన ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ.
అర్షద్ వార్షీ సినిమాల్లోకి రాక ముందు కడుపు నింపుకోవడానికి చాలా పనులు చేశాడు. అందులో భాగంగానే బోరివలి- బాంద్రా మధ్య బస్సులలో లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ కూడా అమ్మేవాడట. కాగా
అర్షద్ వార్సీకి నృత్యం అంటే చాలా ఇష్టం. దీంతో అతను అక్బర్ సమీ నృత్య బృందంలో చేరాడు. మొదట కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఆ తర్వాత ‘తేరే మేరే సప్నే’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు మరియు ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇవి కూడా చదవండి
అర్షద్ వార్సీ పలు విభిన్నమైన పాత్రలను పోషించడం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారాడు. గోల్‌మాల్‌లో మానవ్‌గా, ధమాల్లో ఆదిత్య శ్రీవాస్తవగా అతను పండించిన హాస్యం అందరికీ గుర్తుండి పోతోంది. ఇక ‘మున్నాభాయ్’ సినిమాతో అర్షద్ వార్సీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమాలో అతను పోషించిన ‘సర్క్యూట్’ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడు అర్షద్ వార్సీ.
టీవీ షోలో అర్షద్ వార్సీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి