సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి.. దక్షిణాదిలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు కీర్తికి ఇప్పుడిప్పుడు హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని టాక్. రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న కొత్త ప్రాజెక్టులో కీర్తిని సెలక్ట్ చేశారని తెలుస్తోంది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది కీర్తి సురేష్. కానీ మీకు తెలుసా.. కెరీర్ తొలినాళ్లలో లిప్ లాక్ సీన్ ఉందని ఓ సినిమాను రిజెక్ట్ చేసింది కీర్తి.
ఆ సినిమా మరెదో కాదు.. 2021లో విడుదలైన మాస్ట్రో. ఇందులో తెలుగు హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా కీర్తిని కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ఈ మూవీలో లిప్ లాక్ ఉందని సినిమా నుంచి తప్పుకుందని టాక్. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు. అప్పటికే కీర్తి, నితిన్ ఇద్దరూ కలిసి రంగ్ దే చిత్రంలో నటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కీర్తి సురేష్, నితిన్ కలిసి నటించిన రంగ్ దే సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దక్షిణాదిలో కీర్తి సురేష్ ప్రత్యేకం. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. రఘుతాత, రివాల్వర్ రీటా చిత్రాల్లో నటించింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటుంది కీర్తి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..