ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో ఈరోజు రెండవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరుగుతోంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు తమ ప్లేయింగ్-11ను మార్చుకోలేదు.
13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్ ఉన్నారు. ప్రియాంష్ సెంచరీ సాధించాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
39 బంతుల్లో సెంచరీ..
ప్రియాంష్ ఆర్య 13వ ఓవర్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను 39 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడు ప్రియాంష్. అతని కంటే ముందు, యూసుఫ్ పఠాన్ 2009లో 37 బంతుల్లో సెంచరీ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఆర్ అశ్విన్ నెహాల్ వాధేరా (9 పరుగులు), గ్లెన్ మాక్స్వెల్ (1 పరుగు)లను పెవిలియన్‌కు పంపాడు. ముఖేష్ చౌదరి ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను బౌల్డ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వికెట్లను ఖలీల్ అహ్మద్ పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..