ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తే.. ప్రేమగా మారింది. అమ్మాయి ఎంబీబీఎస్ స్టూడెంట్, అబ్బాయి జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.. ఆ టైమ్‌లోనే ఇద్దరూ ఒక్కటయ్యారు.. కానీ, ఆ అబ్బాయికి జాబ్ రాగానే ప్లేటు మార్చేశాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక మహిళా వైద్యురాలిని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, శారీరకంగా వాడకున్న 30 ఏళ్ల ఐపీఎస్ అధికారిపై పోలీసులు కేసు నమోదు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఇటీవల నాగ్‌పూర్‌లోని ఇమామ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు.
లేడీ డాక్టర్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటికి అతను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలకు సిద్ధమవుతుండగా , ఆ అమ్మాయి MBBS కోర్సు చదువుతోంది. ఇన్‌స్టా స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. నిందితుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
అయితే.. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కు ఎంపికైన తర్వాత, నిందితుడు ఆ అమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటికీ ఆ అమ్మాయి ఆ వ్యక్తి తల్లిదండ్రులు కూడా సంప్రదించగా.. వాళ్లు కూడా స్పందించలేదు, దీంతో తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి ఇమామ్వాడ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, ఐపీఎస్ అధికారిపై అత్యాచారం అభియోగంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.