
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఒక మహిళ తలపై ధరించిన వస్త్రాన్ని బలవంతంగా కొందరు వ్యక్తులు తొలగించిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఒక వ్యక్తి ఓ మహిళ హిజాబ్‌ను బలవంతంగా తొలగిస్తున్నట్లు చూడవచ్చు. అదనంగా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి కూడా చేశారు. పైగా అక్కడున్న వాళ్లు ఈ ఘటనను ఖండించకుండా.. సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..