Authored byతిరుమల బాబు | Samayam Telugu15 Apr 2025, 1:30 pm
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెర లేపింది. ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళికట్టగా.. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న పలువురు నాగసాధువులు ఉత్సహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఇంట్లో తల్లితో, తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశానని.. అందుకే అఘోరితో జీవితం బెటర్ అనిపించిందని వర్షిణి చెప్పుకొస్తోంది. మనసు మారి.. అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నట్లు వెల్లడించింది. తనకు సంసారం సుఖం అక్కరలేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని.. అవసరమైతే ఒక అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి గతంలోనే వెల్లడించింది.