సోమవారం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ తీరప్రాంత ఒడిశా వరకు ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య భాగం నుంచి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ & ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణ గంగా తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది.
నిన్నటి రోజున(ఏప్రిల్ 14) ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య భాగం మీద గల ఉపరితల ఆవర్తనం నుంచి ఛత్తీస్గడ్, జార్ఖండ్, ఒడిశా మీదుగా దక్షిణ గ్యాంజెటిక్ పశ్చిమ బెంగాల్ వరకు కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుంచి 1.5 km ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడింది. అలాగే రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–
ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
——————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
గమనిక:- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం & రాయలసీమలో రాగాల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పులేకపోవచ్చు తర్వాత రోజుల్లో క్రమక్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..