AP Weather Today: వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు, బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా. అయితే, నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇది రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్ష సూచన
- నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
- ఈ జిల్లాల ప్రజల్ని అలర్ట్ చేసిన ఐఎండీ

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు
మరోవైపు రైతులకు ఐఎండీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కాలం (జూన్-సెప్టెంబరు)లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జూన్-సెప్టెంబరు మధ్య సాధారణానికి మించి వర్షాలు ఉండొచ్చంటున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో.. కోస్తాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ఉండొచ్చు అంటున్నారు.