Perecherla To Kondamodu National Highway: ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నుంచి అమరావతికి అనుసంధానం చేసే జాతీయ రహదారి పనులు మొదలు కానున్నాయి. పల్నాడు ప్రాంతంలో పేరేచర్ల-కొండమోడు హైవే నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. భూసేకరణ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి పూర్తయితే గుంటూరు, పల్నాడు ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ వెళ్లడం సులువు అవుతుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త హైవేతో ఈ సమస్య తీరనుంది.
హైలైట్:
- ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం
- అమరావతి, పల్నాడు నుంచి హైదరాబాద్‌కు లింక్
- కేంద్రం నుంచి నిధులు.. త్వరలోనే పనులు షురూ

అందుకే ఈ హైవేను కొత్తగా నాలుగు వరుసలుగా విస్తరించబోతున్నారు. ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు ఉంటుంది.. మధ్యలో డివైడర్ 1.5 మీటర్లు, రెండువైపులా మార్జిన్లు కలిపి మొత్తం 22.5 మీటర్ల వెడల్పుతో విస్తరణ చేయనున్నారు. ఈ హైవేలో భాగంగా మేడికొండూరు, సత్తెనపల్లి, కొండమోడులో బైపాస్‌ల నిర్మాణం చేస్తారు. ఇప్పటికే పేరేచర్ల నుంచి కొండమోడు రోడ్డుకు సంబంధించి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో భూమిని కూడా సేకరించారు అధికారులు. ఈ మేరకు మొదటి దశలో ప్రైవేట్ భూమికి సంబంధించి రైతులకు పరిహారం అందజేశారు. రెండో దశలో అవార్డు వరకు అయ్యింది.. అలాగే అలాగే కొన్ని నిర్మాణాలకు పరిహారం నిర్ణయించగా.. మొదటి దశలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి పరిహారంలో సమస్యల్ని కూడా పరిష్కరించారు.
ఏపీలో కొత్తగా నేషనల్ హైవే రూ.881.61 కోట్లతో.. ఆ రూట్లో నాలుగు లేన్లుగా, హైదరాబాద్‌కు త్వరగా వెళ్లొచ్చు
పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ఆర్డీవో పరిధిలోని ఆయ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఈ రోడ్డుకు సంబంధించి 3డీ ప్రకటన ఇచ్చారు.. అలాగే అవార్డు ప్రకటించారు. ఈ మేరకు పరిహారాన్ని రైతుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు డబ్బులు అకౌంట్లలో జమ కాలేదు. మిగిలిన అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. భూసేకరణ పూర్తి కావడంతో పనులకు శంకుస్థాపన చేయడానికి సిద్ధమవుతున్నారు.. త్వరలోనే తేదీని నిర్ణయించనున్నారు. ఈ మేరకు అతి త్వరలోనే ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయంటున్నారు.