AP Rajya Sabha Mp Election Schedule: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయనున్నారు. మే 9న ఎన్నిక జరగనుండగా, ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కూటమికి దక్కనున్న ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో సిట్ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.
హైలైట్:
- ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్
- ఈ నెల 29 వరకు నామినేసన్లు స్వీకరిస్తారు
- మే 9న ఎన్నికల పోలింగ్.. అదే రోజు రిజల్ట్

‘బ్రెజిల్’ ఆరోపణలపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్-
మరోవైపు విజయసాయిరెడ్డికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్ టీమే.. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విజయవాడ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని చెప్పారట.. అందుకు తగిన విధంగా సిట్ ఏర్పాట్లు చేసుకుంటోందట. ఈ మద్యం కుంభకోణంలో బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కూడా విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని అన్నారు.. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తానన్నారు. ఈ క్రమంలో సిట్ విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి సిట్ విచారణలో విజయసాయిరెడ్డి ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.