స్కూలు, కాలేజీ, కెరీర్.. ఎక్కడికి వెళ్లినా బాడీ షేమింగ్ కి ఫుల్ స్టాప్ పడదా? అలా ఉన్నావేంటి? ఇలా ఎందుకు ఉండవు? మార్చుకోలేకపోయావా? ఓ సారి ట్రై చేస్తావా? తరహా మాటలకు చెక్ పెట్టేదెప్పుడు? అంటూ చర్చ షురూ చేస్తే అలా సాగుతూనే ఉంటుంది. కానీ పట్టించుకోవడం మానేస్తే.. యస్.. తను ఫాలో అయిన ఫార్ములాని షేర్ చేస్తున్నారు నిత్యామీనన్.
ఎన్ని విమర్శలు ఎదురైనా కుంగిపోవద్దు. వాటిని సవాళ్లుగ స్వీకరించి, మీరేంటో నిరూపించుకోమని చెబుతున్నారు నిత్యామీనన్. తాను ఇప్పటిదాకా ఫాలో అయిన ఫార్ములా ఇదేనని అంటున్నారు.
నిత్య ఉంగరాల జుట్టు స్పెషల్గా ఉంటుందని ఇప్పుడు పొగుడుతున్నారు కానీ, ఆ హెయిర్ స్టైల్ గురించి కామెంట్లు చేసిన వారే ఎక్కువట. నీ జుట్టు అలా ఎందుకు ఉందని మొదలుపెట్టి, కనుబొమలు అంత దట్టంగా ఎందుకున్నాయని కంటిన్యూ చేసేవారని గుర్తుచేసుకున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్.
పొట్టిగా ఉన్నానని, లావుగా ఉన్నానని, తగ్గమని, పెరగమని సలహాలిచ్చిన వారి సంఖ్యను లెక్కబెడితే, ఈ లైఫ్ సరిపోదని అంటారు నిత్య. అయితే అలాంటి మాటలు విని అక్కడే ఆగిపోకుండా, కెరీర్ మీద ఫోకస్ చేయాలన్న విషయాన్ని తాను నేర్చుకున్నానని చెబుతున్నారు.
మనుషుల రూపాన్ని బట్టి అంచనా వేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మనం సెలక్ట్ చేసుకున్న కెరీర్లో ప్రూవ్ చేసుకున్నప్పుడు కచ్చితంగా ఇలాంటివాటిని కొట్టిపారేయొచ్చంటున్నారు నిత్య. ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ లేడీ.