అట్లుంటది మా బాలయ్యతో అంటున్నారు నందమూరి అభిమానులు. హీరో కేరక్టర్ చాలా బావుంది.. యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అంటూ అరబిక్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్‌ని ఇష్టంగా షేర్ చేస్తున్నారు. దీంతో పాటు, నెక్స్ట్ బాలయ్య లైనప్ గురించి కూడా డిస్కషన్ షురూ అయింది.
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సౌండ్ చేసింది డాకు మహారాజ్. ఇరాక్‌లోని ఓ న్యూస్ పేపర్లో డాకుమహారాజ్ని రాబిన్‌హుడ్ తరహా మూవీ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఆర్టికల్ పబ్లిష్ అయింది. తెలుగు సినిమా గురించి అరబిక్ పత్రికలో రాయడం అరుదంటూ ఖుషీ అవుతున్నారు అభిమానులు.
ప్రస్తుతం అఖండ2 పనుల్లో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ మూవీకి నార్త్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేటైంది. అఖండ 2 తాండవం సినిమాకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఆల్రెడీ మంచి బజ్ మొదలైంది.
అఖండ సీక్వెల్ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్లో బాలయ్య ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్దిని తెరకెక్కిస్తున్న వృద్ధి సినిమాస్.. బాలయ్య సినిమాను రూపొందిస్తారన్నది టాక్.
గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ జోరును చూపిస్తున్నారు మా బాలయ్య అంటూ సంబరపడుతున్నారు ఫ్యాన్స్. బాలయ్యతో సినిమా చేయడానికి మరికొంతమంది దర్శకులు, నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు.