వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు, కొత్త చట్టంలోని అనేక నిబంధనల గురించి స్పందించింది. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులపై నిబంధనల గురించి కఠినమైన ప్రశ్నలు వేసింది. కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనపై సుప్రీంకోర్టు ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ నిబంధనను ఆధారంగా చేసుకొని.. కేంద్ర ప్రభుత్వం ముస్లింలను హిందూ ఛారిటబుల్ ట్రస్టులలో భాగం కావడానికి అనుమతిస్తుందా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నిస్తూ.. “వక్ఫ్ బై యూజర్”ను ఎలా అనుమతించలేరని ప్రశ్నించింది, ఎందుకంటే చాలా మందికి అటువంటి వక్ఫ్లను నమోదు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఉండవు. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలకు దారితీసిన కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ 73 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. కొత్త చట్టంలోని అనేక నిబంధనలు మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.