Tirupati Nursing Hostel Principal,తిరుపతి కాలేజీ అమ్మాయిల హాస్టల్ గదిలోకి ప్రిన్సిపల్.. అసలు రాత్రి ఏం జరిగింది?, ఎవరి వాదన కరెక్ట్! – nursing college students alleges that principal enter into their hostel in tirupati
Tirupati Principal Enter In Nursing Hostel: తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ప్రిన్సిపల్ అర్ధరాత్రి తమ గదిలోకి వచ్చారని విద్యార్థినులు ఆరోపించడంతో కలకలం రేగింది. భయపడిన విద్యార్థినులు అతడిని నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే, కొందరు విద్యార్థినులు మాత్రం ప్రిన్సిపల్ తమను రాత్రిపూట బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తిరుపతిలోని నర్సింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ ఎపిసోడ్ ఘటన కలకలం రేపింది. స్థానిక లీలామహల్ సర్కిల్లో వర్మ నర్సింగ్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ ఉంది.. అయితే అర్థరాత్రి సమయంలో ప్రిన్సిపల్ తమ గదిలోకి దూరారంటూ కొందరు విద్యార్థినిలు ఆరోపించారు. ఒక్కసారిగా ప్రిన్సిపాల్ గదిలోకి రావడంతో భయపడ్డామని.. వెంటనే అతడిని నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఆ వెంటనే అలిపిరి పోలీసులకు నర్సింగ్ హాస్టల్ విద్యార్థినులు సమాచారం ఇవ్వగా హాస్టల్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.. పోలీసులు ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తన్నారు. కొందరు నర్సింగ్ విద్యార్థినులు ప్రిన్సిపల్ తీరుకు నిరసనగా కాలేజీ నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. నర్సింగ్ కాలేజీ హాస్టల్ ఎపిసోడ్‌పై మరికొందరు విద్యార్థినిల వాదన మరోలా ఉంది. ఓ విద్యార్థిని హాస్టల్ పక్కన ఉన్న భవనంలోకి దూకేసిందని.. ప్రిన్సిపల్ ఈ విషయంపై ఆమెను ప్రశ్నించారని.. అందుకే ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. రాత్రి సమయంలో కొందరు విద్యార్థినులు బయటకు వెళుతున్నారని.. వారిని ఆపేందుకు ప్రిన్సిపల్ హాస్టల్ దగ్గరకు వచ్చారనే వాదన వినిపిస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రిన్సిపల్ అమ్మాయిల హాస్టల్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పుంగనూరులో మరోసారి దాడి కలకలం.
తిరుపతి కాలేజీ అమ్మాయిల హాస్టల్ గదిలోకి ప్రిన్సిపల్.. అసలు రాత్రి ఏం జరిగింది?, ఎవరి వాదన కరెక్ట్!
తిరుపతిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. అసలు ప్రిన్సిపల్ అమ్మాయిల హాస్టల్‌కు ఎందుకు వెళ్లారనే అంశంపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ హాస్టల్లో విద్యార్థినిలు రెండు రకాలుగా వాదనలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. కొందరేమో ప్రిన్సిపల్ ఉద్దేశపూర్వకంగానే లోపలికి వచ్చారంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ను టార్గెట్ చేసి ఆరోపణలు చేసినట్లుగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి