మహిళా సంరక్షణ చట్టాలు ఉన్న సంగతి తెలిసిందే.. ఏ మహిళకైనా అన్యాయం జరిగితే ఆయా చట్టాల ప్రకారం న్యాయం పొందే అవకాశం ఉంటుంది. మహిళపై నేరాలు జరిగినా మహిళల సంరక్షణ చట్టల ద్వారా నిందితుడికి శిక్ష పడుతుంది. కానీ ఇప్పుడు.. పురుషులకు కూడా సంరక్షణ కావాలని గళమెత్తుతున్నారు మగమహారాజులు. ఏపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సత్యాగ్రహం చేసేందుకు సిద్ధమయ్యారు. విశాఖ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరారు. మహిళల సంరక్షణ చట్టాల దుర్వినియోగం కారణంగా దేశవ్యాప్తంగా పురుషుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని.. అందుకోసమే పురుషుల హక్కుల కోసం శాంతియూత నిరసన చేపడుతామంటున్నారు ఏపీ సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రతినిధులు.
దేశవ్యాప్తంగా పురుష హక్కుల ఎన్జీవోల సమ్మేళనం.. సేవ్ ఇండియా ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ గా చేయి చేయి కలిపారు. ఏప్రిల్ 19న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పురుషుల కోసం సత్యాగ్రహం అనే శాంతియుత నిరసనకు. నిరసనలో స్త్రీ సంరక్షణ చట్టాల దుర్వినియోగం, పురుషులపై రోజురోజుకీ పెరిగిపోతున్న గృహహింస, తప్పుడు కుటుంబ కేసుల వల్ల పెరుగుతున్న పురుష ఆత్మహత్యలు, క్షీణిస్తున్న పురుషుల మానసిక శరీరక ఆర్థిక ఆరోగ్యలపై అవగాహన కల్పిస్తామన్నారు ఏపీ సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రతినిధి మధుసూదన్ రాజ్. అంతేకాదు లింగ వివక్ష చూపని చట్టాలు తేవాలని, పురుష సంక్షేమ శాఖ ఏర్పాటుతోపాటు.. జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సత్యాగ్రహం చేస్తున్నట్టు వివరించారు.
మహిళల వేధింపుల వలన అతుల్ సుభాష్, పునీత్ ఖురానా, మానవ్ శర్మ వంటి వారి ఆత్మహత్యలు దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించాయని.. ఈ విషాద సంఘటనలు భారతదేశంలో పెరుగుతున్న జీవిత భాగస్వాముల అశాంతి, లింగ ఆధారిత చట్టాల దుర్వినియోగాన్ని తెలియజేస్తున్నాయన్నారు. తన భర్తను చంపి, అవ యవాలను ముక్కలు చేసిన ముస్కాన్ రస్తోగి కేసు, వైవాహిక సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తతలను మరింతగా వెలుగులోకి తెచ్చాయని మధుసూదన్ రాజ్ అంటున్నారు. ముఖ్యంగా వరకట్నం, అత్యాచారాలకు సంబంధించిన చట్టాల దుర్వినియోగం ఆందోళనకరంగా మారిందని అన్నారు. ప్రతీకారం, దోపిడీ మార్గంగా తరచూ తప్పుడు కేసులను మహిళలు.. పురుషులపై.. నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల పురుషులు నిస్సహాయంగా మారిపోతూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారుతున్న అన్నారు. ఇందుకోసమే.. పురుషులకు కూడా ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేస్తామని అన్నారు.