
నువ్వుల్లో లిగ్నాన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్యాట్‌ను శరీరంలో పేరుకుపోకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ఇందులో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన శరీరానికి శక్తిని అందిస్తూ ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ఈ గింజలు రోజూ కొద్దిగా తింటే బరువు తక్కువయ్యే అవకాశం ఉంది.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు అన్నీ సమపాళ్లలో లభిస్తాయి. ఇవి నిజంగా ఆల్ ఇన్ వన్ సూపర్ ఫుడ్‌లా పరిగణించవచ్చు. ఇవి తిన్నప్పుడు కడుపు త్వరగా నిండినట్టుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ తినకుండానే తృప్తిగా ఉంటారు. ఇవి మోషన్ మెరుగ్గా ఉండేలా చేస్తాయి. జీర్ణ ప్రక్రియ సజావుగా నడవడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది.
గుమ్మడికాయ గింజలు చిన్నవైనా ఎంతో శక్తివంతమైనవే. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల ఆకలి వేయకపోవడం వల్ల ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. దీని వలన బరువు తగ్గడం సులభం అవుతుంది.
హెంప్ సీడ్స్ లో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కండరాల బలాన్ని పెంచుతుంది. అలాగే ఇవి మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. ఇది శరీరం వేగంగా ఫ్యాట్‌ను దహనం చేయడానికి దోహదపడుతుంది. చిన్న మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల మళ్లీ మళ్లీ తినే అలవాటు తగ్గుతుంది.
చియా గింజలు నీటిలో ఉంచితే జెల్లా మారతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే శరీర బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. వీటిని స్మూతీలు, పాలు, పాయసం వంటి వాటిలో కలిపి తినవచ్చు.
బొప్పాయి గింజల్లో ఉండే సహజ ఎంజైములు జీర్ణశక్తిని పెంచుతాయి. ఇవి గ్యాస్, ఉబ్బసం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణం బాగా జరిగితే ఫ్యాట్ పేరుకుపోదు. దీనితో పాటు బరువు కూడా తగ్గుతుంది. ఇవి తక్కువగా తినాలి కానీ సమయానికి తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఈ గింజలు ప్రతిరోజూ మీ డైట్లో భాగం చేస్తే శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. ఫలితంగా ఆకలి వేయకుండా ఉండటం, మెటబాలిజం బాగా పని చేయడం జరుగుతుంది. దీనితో బరువు తగ్గడం సహజంగా జరుగుతుంది. కానీ వీటిని మితంగా, సమతుల్యంగా తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)