Tirumala Darshan TTD Alerts Devotees: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. మద్దెల దీపు బాబు అనే వ్యక్తి నకిలీ దర్శన టికెట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని, అతడిని నమ్మి మోసపోవద్దని సూచించింది. టీటీడీ ఛైర్మన్ కళ్యాణ కట్టలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశించారు. న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి 19 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
హైలైట్:
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్
- జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు
- టీటీడీ పేరుతో ఓ వ్యక్తి మోసాలంటూ

టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు
‘తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టల్లో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షురకుల ప్రవర్తనపై అభిప్రాయాలను భక్తుల నుండి తెలుసుకున్నారు. ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు’ అంటూ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి భక్తుల్ని హెచ్చరించిన టీటీడీ.. ఈయనతో జాగ్రత్తగా ఉండండి
న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 10న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :11-05-2025 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనం.
12-05-2025 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం.
13-05-2025 ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపు పందిరి వాహనం.
14-05-2025 ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం.
15-05-2025 ఉదయం – మోహినీ అవతారం, సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – గరుడ వాహనం.
16-05-2025 ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజవాహనం.
17-05-2025 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.
18-05-2025 ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం.