Guntur Sankar Vilas Flyover: గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి ఆధునీకరణకు మార్గం సుగమమైంది. భూసేకరణకు దుకాణ యజమానులు అంగీకరించడంతో 21 మందికి రూ.70 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆరు నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సహకరించి, నిర్మాణానికి అడ్డుగా ఉండరాదని కోరారు.
హైలైట్:
- గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి లైన్ క్లియర్
- షాపులవారికి చెక్కులు పంపిణీ చేశారు
- ఆరు నెలల్లో టెండర్లు పిలిచి పనులు

గుంటూరువాసుల కల నెరవేరబోతున్న వేళ.. మొత్తానికి లైన్ క్లియర్, కేంద్రమంత్రి కీలక ప్రకటన
శంకర్ విలాస్ సెంటర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఎట్టకేలకు పై వంతెన నిర్మాణం సాకారం కానుందని.. ఈ సమయంలో కొందరు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. వ్యాపారులను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండేళ్లలో పై వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజలకు ఉపయోగపడే వంతెనను అడ్డుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. కోర్టుకు వెళ్లిన వారు కూడా వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. లక్షల మందికి ఉపయోగపడే పని జరుగుతున్నప్పుడు వ్యాపారులు సహకరించాలని కోరారు. పెద్ద ప్రాజెక్టు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవని.. భవిష్యత్తులో జరిగే ప్రయోజనం దృష్ట్యా పై వంతెనకు సహకరించాలన్నారు. వంతెన నిర్మాణానికి ముందే పరిహారం, టీడీఆర్ (TDR) బాండ్లు ఇస్తున్నామన్నారు. కోర్టు కేసులు ఉపసంహరించుకోవాలని వ్యాపారుల్ని కోరారు. మొత్తం మీద గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జికి లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు.