Matsyakara Bharosa Scheme Rs 20 Thousand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల భృతి అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గత ప్రభుత్వ నిబంధనలను సవరిస్తూ, డీజిల్ రాయితీ వినియోగ నిబంధనను తొలగించారు. ఎన్టీఆర్ పెన్షన్ పథకం లబ్ధిదారులు కాకుండా, ఇతర ప్రభుత్వ పథకాలు పొందుతున్నా భృతికి అర్హులే. ఈ నెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
హైలైట్:
- ఏపీలో మరో కొత్త పథకం అమలు
- ఈ నెల 26న అకౌంట్లలో రూ.20వేలు
- ఈ నిబంధనల్ని తొలగించిన ప్రభుత్వం

అలాగే గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాలు, పింఛన్లు పొందే వారు మత్స్యకార భృతికి అర్హులు కాదు. అయితే కూటమి ప్రభుత్వ మాత్రం ఎన్టీఆర్ పెన్షన్ పథకం లబ్ధిదారులై ఉండకూడదని మాత్రమే ప్రస్తుత నిబంధనల్లో ప్రస్తావించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ
పథకాల్లో లబ్ధి పొందుతున్నా భృతి మంజూరు చేస్తారు. ఆరుదశల్లో సమీక్ష ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.. ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనల్లో మార్పుతో మత్స్యకారులకు ఊరట దక్కనుంది.
ఏపీలో వారికి రూ.20వేలు బ్యాంక్ అకౌంట్లో జమ.. ఆ రూల్ను తొలగించిన ప్రభుత్వం
ప్రతి ఏటా ఏపీలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుంది. వేట నిషేధకాలం ప్రారంభమైన నెల రోజుల్లోనే మత్స్యకార భరోసా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు మత్స్యకార భరోసా జమ చేయబోతోంది. గతంలో ఒక్కొక్క మత్స్యకారుడికి రూ.10వేలు అందించేవారు.. కూటమి ప్రభుత్వం భరోసా పెంచి.. ఒక్కొక్క కార్మికుడికి రూ.20వేలు అందించేందుకు నిర్ణయించింది. ఇవాళ ఈ పథకానికి అర్హుల జాబితాల ఆమోదానికి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. ఈ నెల 26న భరోసా నగదు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తారు.