జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పహల్గాంలో మంగళవారం ప్రకృతి అందాలను చూస్తోన్న పర్యటకుల పై ఉగ్రవాదాలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఎంతో మంది జీవితాల్లో విషాదం నెలకొంది. ఈ దాడిపై రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు రియాక్ట్ అవుతున్నారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ అందరూ ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా టాలీవుడ్ నటుడు రచయిత తనికెళ్ల భరణి ఈ ఘటనపై స్పందించారు. ఆయన దాదాపు 40 ఏళ్ల క్రితం రాసిన ఓ కవితను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. “ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!!” అంటూ రాసుకొచ్చారు.
* కుంకం పువ్వు.. *
కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు
పూస్తుందో నా కర్థమైపోయింది !
అక్కడ ఉన్నట్లుండి
పాకే పాకే పసిబిడ్డ
నెత్తురు ముద్దై పోతుంది
సామగానం చేసే
కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి
వేదం ఆగి – రుధిరం బైటికొస్తుంది
అక్కడ రేపు పల్లకీ లెక్కి
ఊరేగాల్సిన పెళ్లికొడుకులు
ఇవాళే పాడెక్కుతారు..
ఆ లోయలో
హిమాలయాలు సైతం
మూర్తీభవించిన
వైధవ్యాల్లా ఉంటాయ్
భరతమాత కిరీటం
వొరుసుకునీ
నిరంతరం అక్కడ
నెత్తురోడుతూ ఉంటుంది !
బుద్ధుడు కూడా
కళ్లూ నోరూ మూసుకుని
మళ్లీ అంతర్ముఖుడౌతాడు !!
అంటూ దాదాపు 40 ఏళ్ల కిందట భరణి కవిత రాశారు. ఇప్పుడు అదే కవితను షేర్ చేయగా.. ఇది 40 ఏళ్ల క్రితం రాసినట్లుగా లేదు..నిన్నటి ఘటన గురించి చెప్పినట్లే ఉంది.. భవిష్యత్తు గురించి భరణి రాశారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..