తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు తీవ్రమైన ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. అలాగే.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదలచేసింది. రాబోవు మూడు రోజులు వర్షాలతో పాటు.. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ పేర్కొంది. వివరాల ప్రకారం.. ఉత్తర ఛత్తీస్గఢ్ & పొరుగు ప్రాంతం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు మధ్య ఛత్తీస్గఢ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ – నైరుతి గాలులు వీస్తున్నాయి.
ఏపీలో మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచింది. ఏపీలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి.. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఏపీలో 11జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ఇచ్చింది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
గురువారం, శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
గురువారం, శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
గమనిక :- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణముతో, గరిష్ట ఉష్ణోగ్రతలలో క్రమంగా 2-3 డిగ్రీలు సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత గణనీయమైన మార్పు లేక స్వల్ప తగ్గుదల ఉండే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..