జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం నాడు మరణించిన పర్యాటకుల పట్ల యావత్ దేశం దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. మృతులకు నివాళులు అర్పించిన ప్రజలు..పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఉగ్రవాద దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఒక స్థానిక వ్యక్తి గాయపడిన వారి ప్రాణాలను కాపాడుతూ కనిపించాడు..గాయపడిన వారిని అతడు తన వీపుపై మోసుకుంటూ వారి ప్రాణాలను రక్షించాడు.. ఇంతకీ ఈ సజ్జాద్ అహ్మద్ భట్ ఎవరో తెలుసుకుందాం?
సజ్జాద్ అహ్మద్ భట్ ఒక కాశ్మీరీ పౌరుడు. శాలువాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు, సజ్జాద్ అహ్మద్ భట్ గాయపడిన వారి ప్రాణాలను కాపాడాడు. గాయపడిన వారిని తన వీపుపై మోసుకుంటూ సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లాడు. సజ్జాద్ అహ్మద్ భట్ ఒక పిల్లవాడిని వీపుపై ఎత్తుకుని పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
We have always been there for our guests and we will always be no matter what.
Look at this kashmiri brother carrying a tourist on his shoulders and saved his life.This is kashmiriyat for you.#kashmiriyatzinadabad pic.twitter.com/jxcV0575KC— Imran Bashir (@Imranbashirkmr) April 23, 2025
వైరల్ వీడియోలో సజ్జాద్ అహ్మద్ భట్ తన కష్టాలను వివరించాడు. పహల్గామ్ పోనీ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ వాహిద్ వాన్ ఉగ్రవాద దాడి గురించి తన బృందానికి తెలియజేశారని అన్నారు. దీనిపై అతను కూడా వారితో వెళ్లి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. గాయపడిన వారికి నీళ్లు ఇచ్చి, నడవలేని వారిని పైకి లేపాడు. మతం కంటే మానవత్వం గొప్పదని చెప్పాడు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Pahalgam, J&K | In a viral video on social media, Sajad Ahmad Bhat, a shawl hawker from Pahalgam, can be seen carrying a tourist injured in the #PahalgamTerroristAttack to safety on his back.
He says, “… The Pahalgam Poney Association president, Abdul Waheed Wan,… pic.twitter.com/cBNTFu3LDA
— ANI (@ANI) April 24, 2025
పర్యాటకులు తన అతిథులు కాబట్టి వారికి సహాయం చేయడం తన కర్తవ్యం అని, తన జీవనోపాధి వారిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. వాళ్ళు చాలా మందిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు గాయపడినవారు సహాయం కోసం అర్తనాదాలు చేస్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాల చూసినప్పుడు తమ ప్రాణాలను పట్టించుకోలేదని చెప్పాడు. పర్యాటకులు ఏడుస్తున్నది చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పర్యాటకుల రాకతో, వారి ఇళ్లలో దీపాలు వెలుగుతాయని, ఈ దారుణ మారణఖండతో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అతడు వాపోయాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..