వచ్చే నెల 7 తేదీన బుధుడు మేష రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉచ్ఛ స్థితిలో ఉన్న రవిని కలవడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు ఆ రాశిలో మే 14 వరకూ కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల విశిష్టమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. రవి ఉచ్ఛలో ఉండడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి మరింత బలం పట్టింది. ఆదాయ, అధికార యోగాలతో పాటు కీర్తి ప్రతిష్ఠలనిచ్చే ఈ యోగం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారు కొన్ని ముఖ్యమైన శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశిలో బుధాదిత్య యోగం పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఈ రాశివారి సలహాలు, సూచనల వల్ల ఎంతగానో లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించు కుంటారు. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ప్రముఖులతో పరిచ యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు వృద్ది చెందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు.
- కర్కాటకం: ఈ రాశికి పదవ స్థానంలో ఉచ్ఛ రవిని బుధుడు కలుస్తున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్ని కొద్ది మార్పు లతో, సరికొత్త వ్యూహాలతో లాభాల బాట పట్టిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నవారు శుభ వార్తలు వింటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు తప్ప కుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగ వృద్ధి చెందే అవకాశం ఉంది.
- సింహం: రాశ్యధిపతి రవి ఉచ్ఛపట్టడంతో పాటు, దానితో బుధుడు కలవడం వల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పద వులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి అవ కాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు హోదా, జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగాలు కలుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. కెరీర్ పరంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.