చూసే కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు ఇప్పుడు నెట్టింట మస్త్ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా అందరూ సోషల్ మీడియా వినియోగిస్తూ ఉండటంతో ఇలాంటి చిత్రాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు మీ అబ్జర్వేషన్ స్కిల్స్ కొన్ని అయితే.. మన ఐ ఫోకస్ ఏ స్థాయిలో ఉందో చెప్పేవి మరికన్ని. ఇంకొన్ని చిత్రాలు మన ఆలోచనల తీరును చెప్పేస్తాయి. తాజాగా అలా వైరల్ అవుతున్న ఓ ఇల్యూజన్ ఫోటోను మీ ముందకు తెచ్చాం. అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం పదండి…
పైన ఫోటోలో మీకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది చెప్పండి..? ఏముంది ఒక ఎద్దు స్కెచ్ అనుకుంటున్నారా! అయితే ఈ ఫొటోలో ఒక మనిషి చిత్రం కూడా దాగి ఉందండోయ్. ఇంకా విఫులంగా చెప్పాలంటే ఒక రైతు ఫొటో ఇందులో ఉన్నది. ఆ ఫొటోను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో టార్గెట్. అయితే కేవలం 10 సెకన్లలో ఈ ఫొటోను కనిపెడితే మీ ఐ ఫోకస్ అదుర్స్ అని చెప్పొచ్చు.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఆ వ్యక్తి ఫొటోను మీరు గుర్తించగలిగారా.? లేదా.? ఈ పజిల్ సాల్వ్ చేయడం అంత ఈజీ అయితే కాదండోయ్. ఫోటోను బాగా ఫోకస్ పెట్టి చూస్తేనే ఆ సమాధానం మీరు కనిపెట్టగలరు. మరో క్లూ ఏంటంటే… ఓసారి చిత్రంలోని ఎద్దు నుదిటిని జాగ్రత్తగా పరీక్షిక్షండి. ఆ మనిషి బొమ్మ కనిపిస్తుంది కదూ. లేదంటే ఒకసారి ఫొటోను ఎడమవైపు 90 డిగ్రీలు తిప్పి ట్రై చేయండి. సైడ్ నుంచి చూస్తున్న వ్యక్తి ముఖం క్లియర్గా కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా సమాధానం దొరక్కపోతే కింద ఫోటోలో సమాధానం చూసేయండి…

Puzzle Answer
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..