విరబూసిన గులాబీలు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్యౌషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. సొగసైన గులాబీ పూలలో పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే గుణాలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు. గులాబీ పూలు చర్మం, జుట్టు, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. చర్మం మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలకు గులాబీలతో చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులను నమలడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. గులాబీ రేకులతో తయారైన కషాయాన్ని తీసుకోవటం వల్ల శరీరంలోని చెడు కొవ్వులు తగ్గుతాయి.
గులాబీ రేకులలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి. గులాబీ రేకులు అలెర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. గులాబీ రేకులతో తయారు చేసిన టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. గులాబీ రేకులు కంటి చూపును మెరుగుపరుస్తాయి. గులాబీ రేకులను నీటిలో మరిగించి, టీలా తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గులాబీల పీల్చడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజ్వాటర్కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..