మంగళవారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం, కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు భూతల స్వర్గాన్ని నరకంగా మార్చారు. అడవులు, పర్వతాలతో చుట్టుముట్టిన ఈ పెద్ద గడ్డి మైదానంలో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కాల్పులు ప్రారంభమైన వెంటనే స్థానికులు భద్రత కోసం పారిపోయారు. పర్యాటకులు నిస్సహాయంగా మిగిలిపోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ దాడి చాలా మంది కుటుంబాలను అంధకారంలోకి నెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పిల్లవాడి వీడియో బయటపడింది. అందులో తండ్రి కోల్పోయినర ఒక కొడుకు ధీనగాథ అందరిని కంటతడి పెట్టిస్తోంది.
ఈ వైరల్ వీడియోలో, ఆ పిల్లవాడు తన తండ్రిని కోల్పోయిన తర్వాత తాను అనుభవించిన బాధను వ్యక్తం చేశాడు. ఆ అమాయకపు పిల్లవాడి ముఖంలో బాధ, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిందని, అక్కడ మొత్తం ఆర్మీ స్థావరం ఉందని, అయినప్పటికీ ఇంత పెద్ద దాడి జరిగిందని ఆ పిల్లవాడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీని తరువాత ఆ పిల్లవాడు, మనం మళ్ళీ అలాంటి దాడిని చూడకుండా ఉండటానికి సైన్యాన్ని పహల్గామ్లో ఉంచమని భారత ప్రభుత్వాన్ని కోరాడు.
వీడియో చూడండి..
This child lost his father in the #Pahalgam attack.
In just 35 seconds he asked more questions to the government than the entire media did in the last 48 hours.
What a powerful video, what a kid, hope god gives him the strength to be strong. pic.twitter.com/cmdLePXOPD
— Roshan Rai (@RoshanKrRaii) April 24, 2025
మీడియా కథనాల ప్రకారం, ఈ పిల్లవాడి పేరు నక్ష్ అతని తండ్రి పేరు శైలేష్‌భాయ్ కల్థియా, అతను సూరత్‌లో బ్యాంకర్. తన తండ్రి చివరి వీడ్కోలు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ పిల్లవాడు ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఎంతగా వర్ణించాడంటే, అది విన్న తర్వాత ఎవరి హృదయమైనా కరిగిపోతుంది. కాల్పుల తర్వాత మేము దాక్కున్నాం.. అయినప్పటికీ కూడా మేము బ్రతకలేకపోయామని ఆ పిల్లవాడు బాధాకరమైన స్వరంతో చెబుతుంటే కన్నీరు ఆగదు. ఏప్రిల్ 23న మా నాన్నగారి పుట్టినరోజు జరుపుకోవడానికి మేము ఇక్కడికి వచ్చామని, కానీ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు ఆయనను కాల్చి చంపారని ఆ పిల్లవాడు కన్నీటి పర్యంతమయ్యారు.
వీడియో చూడండి..
#WATCH | Surat, Gujarat | Shailesh Kalthia, a native of Varachha area of Surat city, was killed in the Pahalgam terror attack on 22nd April.
His son, Naksh Kalthia, says, “We were at the ‘mini Switzerland’ point in Pahalgam, J&K. We heard gunshots… We hid once we realised… pic.twitter.com/t0tKrc5dtI
— ANI (@ANI) April 24, 2025
ఈ వీడియో చూసిన తర్వాత, ప్రజలు దానిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు, ‘నన్ను నమ్మండి, ఈ పిల్లల పరిస్థితి చూసిన తర్వాత, నా గుండె పగిలిపోయింది.’ దేవుడు అతనికి తప్పకుండా న్యాయం చేస్తాడు. మరొకరు ఈ వీడియో చూసిన తర్వాత దేవుడు ఈ ఉగ్రవాదులకు నరకంలో కూడా చోటు ఇవ్వకూడదని అనిపిస్తోందని రాశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..