జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అందరినీ కలచి వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదలు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ ఉగ్రదాడిని ఖండించారు. ఈ ఘటనలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పించారు. టాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు పహల్గామ్ మృతులకు నివాళి అర్పించారు. అయితే అందరూ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు తప్పితే ఏ ఒక్కరూ కూడా మృతుల ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. కానీ మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మాత్రం ఆ మంచి పని చేసింది. ఓ సినిమా ఈవెంట్ కోసం నెల్లూరు వెళ్లిన ఆమె పహల్గామ్ దాడిలో మృతి చెందిన మధుసూధనరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించింది. అతని భౌతికకాయానికి నివాళులు అర్పించింది. మృతుని కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం చెప్పింది. అనంతరం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను.
‘మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అని అనన్య ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి
మధు సూదన్ రావు ఇంటి వద్ద అనన్య నాగళ్ల..
పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను..
శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి… pic.twitter.com/q2ZuMj2G8M
— Ananya Nagalla (@AnanyaNagalla) April 24, 2025
ప్రస్తుతం అనన్య నాగళ్ల షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు అనన్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కూడా దేశ భక్తే నంటూ మన తెలుగమ్మాయిని తెగ మెచ్చుకుంటున్నారు. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజిగా ఉంటోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .