ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరకు బితీష్ కోపంతో పదునైన ఆయుధం తీసుకొని భార్య బైజంతి తల నరికేశాడు. ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ భయానక ఘటనతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరు విషాదానికి లోనయ్యారు. హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెప్పారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని అన్నారు. ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఊహించలేదని అంటున్నారు.