అలాంటిదే ఈ సంఘటన కూడా.. కానీ, ఇక్కడ ఆపదలో ఉన్నది మనిషి కాదు.. ఓ కొండముచ్చు. అయినా సరే.. పెద్ద మనసుతో దానికి నీళ్లు తాగించి. గాయానికి మందు రాసి.. మనుసున్న మనుషులు అనిపించుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ఓ కొండముచ్చు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండముచ్చుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆ కొండముచ్చు గాయాలకు చికిత్స చేశారు. మంచినీళ్ళు తాగించారు. తన పరిస్థితిని గమనించి సాయం చేసిన జనాల పట్ల ఆ కొండముచ్చు కృతజ్ఞతగా చూడడం అక్కడివారిని కదిలించింది. కొండముచ్చుకు అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం స్థానికులు ఆ మూగజీవిని ఆసుపత్రికి తరలించారు. సాటిమనిషికి సాయం చేసేవారే కరువవుతున్న ఈ రోజుల్లో ఓ మూగజీవికి సాయం అందించడం చాలా గొప్ప విషయం. సమయానికి కొండముచ్చుకి సపర్యలు చేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన స్థానికులు, వాహనదారులను పలువురు మెచ్చుకుంటున్నారు. నిజానికి మనిషికి మనిషే సాయం చేయని ఈ రోజుల్లో.. ఓ మూగజీవిని ఇలా ఆదుకోవడం నిజంగా పెద్ద విషయమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో గ్రహంపై జీవం ?? ఇవిగో ఆధారాలు
ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగుతున్నారా ??
ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్
పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??
రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూసి.. ఖంగుతిన్న భక్తులు