వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్ అనే వ్యక్తికి పాకిస్థాన్ చెందిన యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇక పెళ్లి దగ్గర పడుతుండడంతో పెళ్లి పనులు కూడా చేపట్టారు. దాదాపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. పెళ్లి పనుల నిమిత్తం పెళ్లి కొడుకు బంధువులు కొంత మంది పాకిస్థాన్‌లోని పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు. అయితే ఇంకొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇంతలోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ మారణహోమంలో 28 మంది అమాయ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం ఐదు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అట్టారి-వాఘా సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో పాక్-భారత్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిశ్చితార్థం దాకా వచ్చిన సైతాన్ సింగ్ వివాహం నిలిచిపోయింది.
అయితే తన పెళ్లి ఆగిపోవడంపై వరుడు సైతాన్ సింగ్ ANIతో మాట్లాడుతూ ఇలా అన్నారు. ఉగ్రవాదులు చేసింది తప్పు.. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు. పాక్ వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయంతో సరిహద్దులు మూసివేశారు. దీంతో మేం ఇప్పుడు పాకిస్థాన్‌కు వెళ్లలేకపోతున్నాం. ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి మరి అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…