కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అస్థిత్వాన్ని ఆగమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారన్నారు కేటీఆర్. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రీఏంట్రీ అంటూ ఏం ఉందని, ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు కేసీఆర్ అన్న కేసీఆర్, ప్రత్యేకంగా రావటంలేదన్నారు. కేసీఆర్‌కి రీ ఎంట్రీ అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్, 24 ఏళ్లుగా తన చుట్టూ రాజకీయం తిప్పుకుంటున్న నేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ మౌనం సంచలనమే.. మాట్లాడినా సంచలనమే అన్నారు.
ప్రతి ఏటా పార్టీ అవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. వరంగల్‌లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేధికైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ప్రజలు ముందు ఉంచుతామన్నారు. వరంగల్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారని కేటీఆర్ తెలిపారు.
ఓరుగల్లు వేదికగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతోంది కారు పార్టీ. 10 లక్షల మందితో రజతోత్సవ సభను నిర్వహించేందుకు గులాబీ దళం సన్నాహాలు చేస్తోంది. వరంగల్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్న గులాబీ పార్టీ..మూడు జిల్లాల సరిహద్దు అయిన ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఏర్పాటు చేసింది. సభకు 10 లక్షల మంది తరలి వస్తారన్న అంచనాతో 1,213 ఎకరాల్లో సభా స్థలాన్ని సిద్ధం చేశారు.
పార్టీ చరిత్రలో ఇదే భారీ బహిరంగ సభ కాబోతుందని చెబుతున్నాయి గులాబి శ్రేణులు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు భారీ జన సమీకరణపై దృష్టిసారించారు. ఈ మేరకు ప్రజలతో సమన్వయం చేసుకునేందుకు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. దీంతో వారంతా జనసమీకరణలో బిజీ అయిపోయారు. ఈ సభతో తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే జనాలకు ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..