ఐపీఎల్ 2025 కొన్ని మ్యాచ్‌లు ఊహించని విధంగా ముగుస్తున్నాయి. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌లు అయితే.. క్రికెట్ అభిమానులు, ఎక్స్పర్ట్స్ అంచనాలను కూడా తలకిందులు చేశాయి. ప్రపంచంలో మరే టీమ్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఓడిపోదు అనుకునే స్థితిలో ఉండి కూడా.. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. తాజాగా గురువారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ గత రెండు మ్యాచ్‌ల్లో లక్నో, ఢిల్లీపై ఎలా ఓడిపోయిందో సేమ్ అలానే ఆర్ఆర్ ఓడిపోయింది. దీంతో మరోసారి ఆర్ఆర్పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అసలు గత మూడు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఏం చేసింది? ఆ టీమ్‌పై వచ్చే ఆరోపణల్లో నిజమెంతా అనేది ఇప్పుడు చూద్దాం..
ముందుగా ఏప్రిల్ 16న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. ఆ మ్యాచ్‌లో ఆర్ఆర్ 189 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ అంతా అద్భుతంగా ఆడుతూ.. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు చేయాలి. చేతిలో ఏకంగా 7 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో డేంజరస్ హెట్మేయర్, ధృవ్ జురెల్ ఉన్నారు. 19వ ఓవర్లో ఏకంగా 14 పరుగులు వచ్చేశాయి. ఇక చివరి 6 బంతుల్లో 9 రన్స్ మాత్రమే కావాలి. అయినా కూడా ఆర్ఆర్ గెలవలేపోయింది. మ్యాచ్‌ను టై చేసుకొని, సూపర్ ఓవర్లో ఓడిపోయింది. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్స్.. టార్గెట్ 181, చివరి 12 బంతుల్లో 20 రన్స్ మాత్రమే కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ ఉన్నారు. 19వ ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. మళ్లీ చివరి ఓవర్లో 9 రన్స్ కొట్టాలి, కానీ, ఓడిపోయారు. ఢిల్లీతో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్, లక్నోతో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ సూపర్ బౌలింగ్‌తో హీరోలుగా నిలిచినా.. చివరి ఓవర్లలో చెత్త బ్యాటింగ్‌తో పాటు ప్రెజర్‌కు ఆర్ఆర్ బ్యాటర్లు తలొంచారు. దీంతో.. గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లో కూడా సేమ్ రిజల్ట్‌లో ఓటమి పాలయ్యారు.
ఇక గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. టార్గెట్ 200 ప్లస్ అయినప్పటికీ.. 18 ఓవర్లు ముగిసే సరికి ఆర్ఆర్ స్కోరు 188. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో జురెల్, శుభమ్ దూబె ఉన్నారు. అందులోనా 18వ ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. ఇక చివరి 12 బంతుల్లో కావాల్సిన రన్స్ కేవలం 18 మాత్రమే. చివరి రెండు ఓవర్లలో ఒక లూజ్ ఓవర్ కూడా ఉంది. ఆ రెండు ఓవర్లలో ఒక్క ఓవర్ మాత్రమే హేజల్‌వుడ్, తర్వాత ఓవర్ కచ్చితంగా అంతగా ప్రభావం చూపని యష్ దయాల్ ఉన్నాడు. అయినా కూడా ఆర్ఆర్ ఓడిపోయింది. 18వ ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసిన జురెల్.. 19వ ఓవర్లో ఓ నార్మల్ యార్కర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత మరో వికెట్ పడింది. సింపుల్‌గా గెలుస్తుందని అనుకున్న రాజస్థాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా పోయింది అనుకున్న ఆర్సీబీ.. మ్యాచ్ గెలిచి అద్బుతమే చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితి నుంచి.. ఆర్ఆర్ ఓడిపోయింది.
దీంతో.. క్రికెట్ అభిమానుల్లో ఆర్ఆర్పై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే.. గతంలో ఒకసారి రాజస్థాన్ రాయల్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఓ రెండేళ్లు బ్యాన్ కూడా పడింది. ఇప్పుడు ఇలా డ్యామ్ ష్యూర్‌గా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కావాలని ఓడిపోతున్నట్లు కనిపిస్తుండటంతో ఇలాంటి అనుమానాలు, ఆరోపణలువ వస్తున్నాయి. అయితే.. అవన్నీ నిజం అని అనుకోలేం. ఎందుకంటే.. క్రికెట్ అంటేనే అన్‌ప్రిడక్టబుల్ గేమ్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్క ఓవర్, ఒక్క వికెట్, ఒక్క షాట్ మ్యాచ్‌ను మలుపుతిప్పొచ్చు. అలాంటి ఎన్నో మ్యాచ్‌లు చూశాం. కాకపోతే.. ఇప్పుడు ఆర్ఆర్ విషయంలో వరుసగా మూడు సార్లు ఇలానే జరగడం వల్ల ఇన్ని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. అంతే కానీ, ఫిక్సింగ్ లాంటిది ఏం ఉండదు. ఇక పోతే.. ఆర్ఆర్ ప్రెజర్ తట్టుకోలేకపోవడం, వాళ్లకు సరైన ఫినిషర్ లేకపోవడంతో పాటు ప్రత్యర్థి జట్ల బౌలర్లు.. మిచెల్ స్టార్క్, ఆవేశ్ ఖాన్, జోష్ హేజల్‌వుడ్ అత్యాద్భుతంగా బౌలింగ్ చేశారనే నిజాన్ని మనం ఒప్పుకోవాలి. వారి కష్టాన్ని, టాలెంట్‌ను మన ఆర్ఆర్పై అనుమానంతో తక్కువ చేయకూడదు. ఇట్స్ క్రికెట్.. ఇలాంటివి జరుగుతుంటాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..