చివరకు అనుకున్నది సాధించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన అంజని పుత్ర, చమక్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. 2018లో ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే ఆమె జీవితం పూలపాన్పు ఏమీ కాదు. చిన్నప్పుడుఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. బాల్యంలో తన తల్లిదండ్రులు అద్దె కట్టలేక ఎన్నోసార్లు ఇళ్లు మార్చుకోవాల్సి వచ్చిందని, పేరెంట్స్ పడుతున్న కష్టాలు చూసి కనీసం ఓ బొమ్మ కొనివ్వమని కూడా అడిగేదాన్ని కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చిన్నప్పుడు పడ్డ ఆ ఆర్థిక కష్టాలే తనకు డబ్బు విలువ తెలియజేసిందంటుంది రష్మి, రష్మిక మందన్న గత రెండేళ్లలో నటించిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలైన యానిమాల్, పుష్ప 2, ఛావా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వేల 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించాయి. ఈ బాక్సాఫీస్ సునామీతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లను సైతం రష్మిక వెనక్కి నెట్టింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం రష్మిక నెట్ వర్త్ 66 కోట్లు. పుష్ప 2 : ది రూల్ మూవీకి ఆమె 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా ??